Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కియా కంపెనీ ఉద్యోగుల ఘర్షణ: ఇనుప రాడ్లతో కొట్తుకున్నారు, వీడియో వైరల్

అమరావతి: అనంతపురంలోని కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

జూనియర్లు, సీనియర్లు అంటూ పరస్పరం నిందించుకుంటూ ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడి ఘటనను కంపెనీలోని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా స్థానికంగా కలకం రేపింది.

 anantapur kia company employees fighting each other with iron rods: video goes viral.

అనంతపురంలోని కియా కంపెనీలోని ప్రధాన ప్లాంట్లైన హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుంటాయట. ఈ నేపథ్యంలోనే మంగళవారం కూడా ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతకాలం స్వల్ప వివాదాలే జరుగుతుండగా.. ఇవాళ మాత్రం భయానక రీతిలో ఇనుపరాడ్లతో దాడులు చేసుకున్నారు.

రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులతో కియాలో పని చేస్తున్న మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఉద్యోగులు. కంపెనీ నిర్వాహకులు కూడా ఈ ఘర్షణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోనట్లు తెలుస్తోంది.

కాకినాడలో దారుణం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. భర్తే కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో పారా మెడికల్‌ కోర్సు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదారి జిల్లా యాళ్లగూడెంకు చెందిన గంగరాజు, సుధారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పది నెలల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరూ సెప్టెంబర్ 17న నగరంలోని ఓ లాడ్జిలో బస చేశారు. మనస్పర్ధలతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో గంగరాజు.. తన భార్య సుధారాణి మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు ఏలూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+