అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: డప్పు చప్పుళ్లకు స్టెప్పులేసిన అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప: రంగులు చల్లుకుంటూ..!!

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఇవ్వాళ తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించారు. వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చేపట్టిన భద్రత చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. తాడిపత్రి డీఎస్పీ, రూరల్ సీఐతో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా బోడాయిపల్లిలో గ్రామస్తులు నిర్వహించిన వినాయక విగ్రహాల ఊరేగింపులో ఫక్కీరప్ప పాల్గొన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ట్రాక్టర్‌‌పై ఊరేగింపుగా తీసుకెళ్తోన్న సమయంలో వినిపించిన డప్పు చప్పుళ్లకు ఆయన ఆగలేకపోయారు. ఉత్సాహంగా గ్రామస్తులతో స్టెప్పులేశారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డాన్స్ చేశారు. ఎస్పీగా కాకుండా- ఓ సామన్యుడిలా ఆయన కలిసి పోయారు.

Anantapur SP Fakkirappa dance with the locals during the Ganesh idols immersion in Tadipatri.

ఊరేగింపును చూస్తూ ఓ పక్కన నిల్చున్న వారిని కూడా ఎస్పీ స్వయంగా డాన్స్ చేయాలంటూ ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని పిలవడం కనిపించింది. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. పరస్పరం రంగులు చల్లుకున్నారు. స్వయంగా ఎస్పీ తమతో కలిసి స్టెప్పులేయడంతో తాడిపత్రి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ చైతన్య, తాడిపత్రి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చినపెద్దయ్య, కానిస్టేబుళ్లు సైతం చిందులేశారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా చిందులేశారు.

Anantapur SP Fakkirappa dance with the locals during the Ganesh idols immersion in Tadipatri.

ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు తమతో కలిసి పోవడంతో గ్రామస్తుల్లో ఆనందోత్సాహాలు మరింత వెల్లివిరిశాయి. పోలీసు అధికారులపై రంగులు చల్లారు. సుమారు గంటపాటు ఎస్పీ, డీఎస్పీ.. బోడాయిపల్లి ఊరేగింపులో గడిపారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫ్యాక్షన్ గ్రామంగా బోడాయిపల్లికి పేరుంది. అలాంటి చోట ఎస్పీ స్వయంగా గ్రామస్తులతో కలిసి పోయారు. వినాయక విగ్రహాల నిమజ్జనం ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

English summary
Anantapur SP Fakkirappa dance with the locals during the Ganesh idols immersion in Tadipatri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X