వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత, రవికి సంబంధించిన అంశంలో వివాదం చెలరేగడం ఇదే మొదటిసారి. పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో కార్యక్రమాలు జరుగుతుండగా..

Recommended Video

    టీడీపీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది- పరిటాల సునీత

    జిల్లాలోని కంబదూరం మండలంలో గల కదిరిదేవరపల్లి అనే గ్రామంలో పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫ్లెక్సీల కాల్చివేతపై పరిటాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు..

    paritala ravi death anniversary: flexies burnt in anantapur dist, sunitha comments

    పరిటాల రవి 16వ వర్థంతి సందర్భంగా వెంకటాపురంలోని స్థూపం వద్ద ఆయన భార్య, మాజీ మంత్రి పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన మనవడితో వచ్చి పరిటాల రవికి నివాళులర్పించామన్నారు. అంతేకాదు..

    paritala ravi death anniversary: flexies burnt in anantapur dist, sunitha comments

    రవి వర్ధంతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్త, అన్నదానాలు చేస్తున్నామని సునీత చెప్పారు. పరిటాల రవి ఆశయాలను కొనసాగిస్తామని, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హింస, కక్ష సాధింపులు పెరిగిపోయిన తరుణంలో రవి ఆశయాలను సాధించాల్సిన అవసరం పెరిగినట్లు భావిస్తున్నానని ఆమె అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తదితరులు కూడా పరిటాల స్మారక స్థూపాన్ని దర్శించి నివాళులర్పించారు.

    paritala ravi death anniversary: flexies burnt in anantapur dist, sunitha comments
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+