Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైళ్ళలో 11రకాల హారన్స్ ఉపయోగిస్తారు.. ఏ హారన్ ఎందుకంటే!!

రైళ్లలో ప్రయాణించేటప్పుడు రకరకాల హారన్స్ ను వింటూ ఉంటాం. అసలు రైళ్లు ఈ హారన్స్ ఎందుకు ఉపయోగిస్తాయి? ఏ హారన్ దేనికి సంకేతం? వంటి అనేక విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. రైల్లో మొత్తం 11 రకాల హారన్స్ ఉపయోగిస్తారు. ఈ హారన్స్ కు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంది.

వన్ షార్ట్ హారన్: ఇది ప్రయాణం ప్రారంభించే ముందు రైలు ను శుభ్రం చేసేందుకు సంబంధిత యార్ద్ కు వెళ్ళినప్పుడు ఉపయోగిస్తారు. ప్రాథమికంగా ఇది చాలా తక్కువ సమయం పాటు ఒకసారి మాత్రమే ప్లే అవుతుంది.

 train

టు షార్ట్ హారన్: ఇది కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా రెండుసార్లు మోగిస్తారు. రైలు బయలుదేరేటప్పుడు మోటర్ మెన్, గార్డుల నుండి సిగ్నల్స్ కోసం ఈ హారన్ మోగిస్తారు.

త్రీ షార్ట్ హారన్: ఇది కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా మూడుసార్లు మోగిస్తారు. ఈ హారన్ మోగినప్పుడు డ్రైవర్ రైలును ఆపలేడని గార్డ్ గ్రహించటం కోసం మోగిస్తారు.

ఫోర్ షార్ట్ హారన్: ఇది కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా నాలుగు సార్లు చిన్న హారన్ ను ఉపయోగిస్తారు. రైలులో యాంత్రిక లోపం సంభవించే ప్రమాదాన్ని సూచించటానికి డ్రైవర్ ఈ హారన్ ను ఉపయోగిస్తారు.

ఒక లాంగ్ మరియు ఒక షార్ట్ హారన్: రైలును ప్రారంభించే ముందు ఈ రకమైన హారన్ ను ఉపయోగిస్తారు. లాంగ్ హారన్ మోగిన తర్వాత షార్ట్ హారన్ ఉపయోగించబడుతుంది. రైలు డ్రైవర్ బ్రేక్ ను విడుదల చేయమని గార్డుకు సూచించటం దీని అర్థం.

లాంగ్ హారన్: సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎక్కువగా లాంగ్ హారన్ మోగిస్తారు. ఆగని స్టేషన్లవద్ద లాంగ్ హారన్ మోగిస్తూ లోకల్ రైళ్ళకు సంకేతాన్ని ఇస్తారు.

రెండు లాంగ్ మరియు రెండు షార్ట్ హారన్స్: ఈ రకమైన హారన్ మోగించటం ద్వారా రైలు డ్రైవర్ ప్రాథమికంగా ఇంజన్ను నియంత్రించమని గార్డ్ కు సూచిస్తాడు. ఈ హారన్ లో లాంగ్ హారన్ రెండుసార్లు, షార్ట్ హారన్ రెండుసార్లు మోగిస్తారు.

టూ హారన్ టూ పాస్: రైల్వే క్రాసింగ్ ను దాటినప్పుడు ఈ తరహా హారన్ ను ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో రెండు షార్ట్ హారన్లు ఆగి ఆగి మోగిస్తారు.

టూ లాంగ్ వన్ షార్ట్ హారన్: రైలు ట్రక్కులను మార్చేటప్పుడు రైల్వే డ్రైవర్ ను అప్రమత్తం చేయడానికి మోటర్ మెన్ ఈ రకమైన హారన్ మోగిస్తారు.

 train
రెండు షార్ట్ హారన్ లు, ఒక లాంగ్ హారన్: అత్యవసర పరిస్థితులలో చైన్ ను లాగి రైలును ఆపడానికి ప్రయాణికులు ప్రయత్నించినప్పుడు ఈ రకమైన హారన్ ను ఉపయోగిస్తారు.

ఆరు షార్ట్ హారన్స్ : సాధారణంగా అత్యవసర పరిస్థితిలో ఈ రకమైనహారన్ ను రైలు డ్రైవర్ మోగిస్తాడు. పెద్ద ప్రమాదం జరిగితే డ్రైవర్ వరుసగా ఆరు సార్లు హారన్ మోగిస్తాడు. రైలు హారన్ ల గురించి తెలిస్తే డ్రైవర్ హారన్ ల ద్వారా ఏం చెప్తున్నాడో అర్ధం అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+