వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా మా పరిధిలోలేదు, బాబు ప్రకటనలో రాజకీయ అంశాలు: 15వ ఆర్థిక సంఘం చైర్మన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Finance Commission Chairman On Special Status

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశం పదిహేనో ఆర్థిక సంఘం పరిధిలో లేదని ఛైర్మన్‌ ఎన్‌కె సింగ్ తెలిపారు. తమకు ఇచ్చిన విధివిధానాలను సవరించే వరకు ఈ అంశంపై అధ్యయనం చేయలేమన్నారు. ఆయన ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడారు.

పట్టించుకోవట్లేదు, అందుకే నేను ఇలా: పవన్ కళ్యాణ్‌పై జేపీ విమర్శలుపట్టించుకోవట్లేదు, అందుకే నేను ఇలా: పవన్ కళ్యాణ్‌పై జేపీ విమర్శలు

హోదా అంశం 1969 నుంచి అమల్లోకి వచ్చిందని, అప్పట్లో గాడ్గిల్‌ ఫార్మూలాను ఎన్డీసీ ఆమోదించడంతో మొత్తం పదిహేడు రాష్ట్రాలకుగాను జమ్ము కాశ్మీర్‌, అసోం, నాగాలాండ్‌కు మాత్రమే హోదా కల్పించారని చెప్పారు.

15th Finance Commission NK Singh on special status

అనంతరం క్రమంగా ఏర్పడిన ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌కు వర్తించిందని చెప్పారు. ప్రస్తుతం హోదా రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్, 10 శాతం రుణ రూపంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ ఏపీకి హోదా ప్రయోజనాలు కల్పిస్తామని విభజన సమయంలో చెప్పారు కాబట్టి వాళ్లు దానిని ఆశిస్తున్నారని తెలిపారు.

దాంతో పన్ను రాయితీలు కూడా వస్తాయని భావిస్తున్నారన్నారు. పరిశ్రమలను ఆకట్టుకోడానికి పన్ను రాయితీలు ఉపయోగపడడంతో పాటు 90:10 సాయం వల్ల అదనపు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చంద్రబాబు అనుకుంటున్నారని, ఏపీకి ఇచ్చిన హామీలను ఇప్పుడు తిరస్కరించినట్లు ఆయన భావిస్తున్నారని, 14వ ఆర్థిక సంఘం హోదాను కొనసాగించాలనుకోవడం లేదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పింది నిజమే అన్నారు.

ఇప్పుడు తనకు అప్పగించిన విధివిధానాలకు లోబడే పని చేయాల్సి ఉంటుందని, అందులో హోదా అంశం లేదన్నారు. కేంద్ర మంత్రివర్గం దీనిని కూడా చేర్చి సవరించి పంపితే రాష్ట్రపతి దానిని నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు.

అందువల్ల ఏపీ డిమాండ్‌పై కేంద్ర మంత్రివర్గం చర్యలు తీసుకోవాలని, విధివిధానాలు సవరించి పంపితే పరిశీలించడం తమకు అసాధ్యం కాదన్నారు.

ఒకవేళ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తమ పరిధిలో చేర్చితే కొన్ని తీవ్ర ప్రభావాలుంటాయని, వెనుకబాటుతనాన్నే కొలమానంగా తీసుకుంటే ఒడిశా, బీహార్‌లే అన్నింటికంటే ముందుంటాయన్నారు. హోదాకు మించిన మొత్తాన్ని ఇస్తామని జైట్లీ నిజాయితీగా చెప్పారన్నారు. చంద్రబాబు ప్రకటనలో ఆర్థిక అంశాల కంటే రాజకీయ అంశాలే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయన్నారు.

English summary
15th Finance Commission NK Singh on special status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X