Nara Lokesh: లోకేష్ గొప్ప మనసు- ఆ చిన్నారి ప్రాణం కోసం 6 కోట్ల సాయం..!

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (nara lokesh) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం రూ.16 కోట్ల ఖర్చవుతుందని తెలిసి విరాళాల కోసం ఎదురుచూస్తున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక (punarvika) కోసం ముందుకొచ్చారు. తన తల్లితండ్రులు ఎక్స్ లో తన అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్ కు జవాబిస్తూ తన వంతుగా ఆరు కోట్ల సాయం చేస్తానని లోకేష్ వెల్లడించారు. దీంతో లోకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

లోకేష్ తన ట్వీట్ లో SMA టైప్-1 అనేది అరుదైన, వినాశకరమైన జన్యుపరమైన వ్యాధి అని, ఇది పిల్లల కండరాలను బలహీనపరుస్తుందని తెలిపారు. నెమ్మదిగా కదిలే, శ్వాసించే, సాధారణంగా జీవించే సామర్థ్యాన్ని కోల్పోతుందన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన చిన్న పునర్విక నిజమైన ధైర్యవంతురాలని ప్రశంసించారు. అసాధారణ ధైర్యంతో ఈ యుద్ధంలో పోరాడుతోందన్నారు.

6 Crore Donation Nara Lokesh Pledges Funds to Save Kurnool s Punarvika from SMA Type 1

ఆమె జీవితాన్ని మార్చే ఇంజెక్షన్ ఖరీదు ₹16 కోట్లు. పునర్విక కథ ఆ బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చిన వేలాది మంది ఉదారవాదులను కదిలించడం చూడటం హృదయపూర్వకంగా ఉందన్నారు. ఇప్పటికే ₹10 కోట్లు సేకరించారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పునర్వికకు అర్హమైన ప్రాణాలను రక్షించే చికిత్స కోసం మిగిలిన ₹6 కోట్లు అందేలా చూసుకోవడం తన వంతు అని లోకేష్ ప్రకటించారు. ఇందుకు తన కార్యాలయాన్ని దయచేసి సమన్వయం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ధైర్యవంతురాలైన బిడ్డకు నిధులు సమకూర్చడానికి అందరూ మద్దతు అందించాలని లోకేష్ అభ్యర్ధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+