వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. వైరస్ పరీక్షల కన్నా.. డిశ్చార్జీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ శనివారం అధికారులతో సమీక్షించారు.

కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు..

మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు..


రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 3 వేల 91 పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు లక్ష 65 వేల 59 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే 8 వేల 388 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. కరోనా వైరస్‌తో మరణాలను అరికట్టడంపై దృష్టిసారించామన్నారు. వైరస్ సోకిని ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.

ఎవరూ చనిపోతున్నారంటే..

ఎవరూ చనిపోతున్నారంటే..

దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్నవారే చనిపోతున్నారని పేర్కొన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారిపై ఫోకస్ చేశామన్నారు సీఎం జగన్. 700 మంది కూలీలు అనుమతి లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితో కరోనా ప్రభావం ఉంది అని చెప్పారు. టెలీ మెడిసిన్‌పై ఫోకస్ చేశామని.. రోగులు కాల్ చేసిన 24 గంటల్లో ఔషధాలు అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

11 చెక్ పోస్టుల వద్ద

11 చెక్ పోస్టుల వద్ద

రాష్ట్ర సరిహద్దుల్లోని 11 చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. సరిహద్దు దాటి వచ్చేవారికి థర్మల్ స్కీనింగ్ పరీక్షలు చేస్తామని తెలిపారు. విశాఖపట్టణంలో గ్యాస్ లీకైన ప్రాంతాల్లో పశువులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

English summary
700 migrants workers enter into andhra pradesh state chief minister ys jagan mohan reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X