Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోటెత్తుతున్న ఓటర్లు - ఎవరికి అనుకూలం..!!

ఏపీలో ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభ సమయానికే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. యువత..మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. తొలి రెండు గంటల్లో దాదాపుగా పది శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల ఓటింగ్ శాతం ఎక్కవ నమోదు అవుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. దీంతో, పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసి వస్తుందనేది పార్టీల్లో ఉత్కంఠ పెంచుతోంది.

ఓట్ల పండుగ
రాష్ట్రం వ్యాప్తంగా ఓట్ల పండుగ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పది శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ రికార్డు అయింది. ఈ సారి అంతకంటే ఎక్కువ జరగుతుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ దంపతులు పులివెందులలో ఓటు వేసారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9 51 Voting turn out across Andhra Pradesh in first two hours heavy que lines in Rural areas

ఓటు వేసిన ప్రముఖులు
మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోటీ లో ఉన్న అభ్యర్దులు ప్రములు..ఓట్లు వేస్తున్నారు. విజయనగరంలో ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్‌లో నిల్చున్న వృద్ధురాలు మృతి చెందింది. నెల్లిమర్ల నియోజకవర్గం తంగుడుబిల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు.. చాలా సేపు నిల్చొని కుప్పకూలింది.. మృతురాలు పలూరి పెంటమ్మగా గుర్తించారు. ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందినట్లు స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.

ఎవరికి అనుకూలం
అనంతపురంలో 9.18 శాతం, ఏలూరు లో 10 శాతం, పిఠాపురంలో 10 శాతం, క్రిష్ణా జిల్లాలో 10.08 శాతం, కడపలో 12 శాతం, సత్యసాయి జిల్లాలో 6.92 శాతం, తిరుపతిలో 8.11 నమోదైంది. గోదావరి జిల్లాల్లో, తిరుపతి లోనూ క్యూ లైన్ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో హోరా హోరీగా తలపడుతున్న పార్టీలు పోలింగ్ సరళిని గమనిస్తున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్నాహ్నం తరువాత పోలింగ్ ట్రెండ్స్ పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే పోలింగ్ శాతం మొత్తంగా ఎంత మేర నమోదవుతుందనేది ఇప్పుడు ఫలితంలో కీలకం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+