ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తుల కోసం - ఈ సారి అంతా ప్రత్యేకం..!!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ వెలుగులతో ఇంద్రకీలాద్రి అపర కైలాసక్షేత్రమై భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష పూజలు నిర్వహించి జగన్మాతను రెండో రోజు అయిన నేడు గాయత్రీదేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

గాయత్రీ దేవిగా
ఇంద్రకీలాద్రి పై దశావతారాల్లో అమ్మ దివ్యమంగళ స్వరూపాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఐదు క్యూలైన్లలో రెండు క్యూ లైన్లు సామాన్య భక్తుల ఉచిత దర్శనం కోసం, వంద రూపాయల టికెట్ల ద్వారా దర్శించినందుకు టికెట్ల ద్వారా దర్శించుకునేందుకు ఒక వరుస, 300 రూపాయల టికెట్లతో దర్శించుకునే వారికోసం ఒక వరుస, మూడోది 500 రూపాయల క్యూ లైన్లుగా ఏర్పాటు చేశారు.

A large number of devotees thronged the Kanaka Durga temple atop the Indrakeeladri hill

ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొమ్మిదో తేదీ మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాలు ముగిసేంతవరకు తొమ్మిది రోజులు దుర్గా ఘాట్ వద్ద కృష్ణమ్మకు నవ హారతులు కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ఆలయంలోని ఆరో అంతస్తులో మూలవిరాట్టు మాదిరిగానే ఉత్సవ మూర్తిని కూడా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ సహితంగా కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పంచహారతులు అనంతరం ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కలిపించారు.

అమ్మవారికి వజ్రాల కిరీటం
ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరబ్ గౌర్, కడప జిల్లాకు చెందిన వ్యాపారి సీఎం రాజేష్‌ అమ్మవారికి వజ్రాల కిరీటం, వజ్రాల సూర్యచంద్రులను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి, సూర్యకుమారి అమ్మవారికి నత్తు, బొట్టు చేయించారు. ఉత్సవాలు ప్రారంభం రోజున 56 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వహణ సేవా కమిటీని ప్రకటించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ, ఏర్పాట్లను సమీక్షిస్తూ ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన సూచనలు చేస్తున్నారు. దర్శనం, సేవా టిక్కెట్లు, ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+