సర్వేకొచ్చిన మహిళా ఎన్యుమరేటర్ పట్ల అసభ్యప్రవర్తన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వే కోసం ఓ ఇంటికెళ్లిన మహిళా ఎన్యుమరేటర్‌ పట్ల ఆ ఇంటి యజమాని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నారాయణగూడ పోలీస్ స్టేషణ్ సమీపంలోని వెంకటస్వామి నగర్‌లో మంగళవారం ఉదయం నుంచే సర్వే సాగింది. వివరాల సేకరణ కోసం మహిళా ఎన్యుమరేటర్ ఒకరు ఓ ఇంట్లోకి వెళ్లారు.

A man allegedly molest a enumerator

వివరాలన్నీ రాసుకున్న తర్వాత, పత్రంపై సంతకం పెట్టాలని ఆ ఇంటి యజమానిని కోరారు ఎన్యుమరేటర్. అదంతా తర్వాత చూసుకుందాంలే.. అంటూ అతడు ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు అతని చేతిని వదిలించుకుని పరుగున బయటికి వచ్చి సహచర ఎన్యుమరేటర్లకు విషయాన్ని తెలిపింది.

వారు విషయాన్ని నారాయణగూడ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆమెను కోరారు. బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. కాగా, నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+