కొడుకు మృతితో తల్లడిల్లి ఆగిన తల్లి గుండె.. తిరుపతి జిల్లాలో విషాద ఘటన
తల్లికి పిల్లలు అంటే ఎనలేని ప్రాణం. నవమాసాలు మోసి, తన ప్రాణాలు పణంగా పెట్టి, తన రక్తం పంచుకు పుట్టిన కొడుకుకు ఏదైనా చిన్న హాని జరిగిందంటే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అమ్మ ప్రేమ గొప్పతనం అలాంటిది. పిల్లలంటే ప్రాణ సమానంగా చూసే తల్లి తన కొడుకు తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే తట్టుకుంటుందా? తట్టుకోలేదు.
అలా తల్లడిల్లిన తల్లి గుండె కొడుకు మృతితో ఆగిపోయింది. ఇక ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుంగరాంపల్లి లో చోటు చేసుకుంది. తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శంకర్ భార్యా పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. 35 సంవత్సరాల శంకర్ మంగళవారం సాయంత్రం ఇంట్లో పనుల్లో భాగంగా బాత్రూంలో బల్బు వెలగడం లేదని రిపేర్ చేద్దామని వెళ్ళాడు.

అయితే రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి బాత్రూం లోనే కుప్పకూలి మరణించాడు. కొడుక్కి విద్యుత్ షాక్ తగిలిందని అక్కడకు వెళ్లి విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసిన తల్లి గుండె తల్లడిల్లిపోయింది. దీంతో తల్లి చంద్రమ్మ కూడా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. మృతుడు శంకర్ కు భార్య, ఇద్దరు పిల్లలు.
ఇక ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటన గ్రామస్తులు అందరినీ కంటతడి పెట్టించింది. విద్యుదాఘాతంతో కొడుకు, మరణించిన కొడుకుని చూసిన తల్లి ఇద్దరూ కానరాని లోకాలకు చేరిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకుంది. కొడుకుపై తల్లి ప్రేమను అందరూ చెప్పుకుంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications