అవాక్కయ్యే ప్రీ వెడ్డింగ్ షూట్; పాపం.. తలక్రిందులుగా పెళ్లి కొడుకు.. వీడియో వైరల్
పెళ్లికి ముందు వధూవరుల ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ఒక ట్రెండ్ గా తయారయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వధూవరులు డ్రెస్ డిజైన్లు చేసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాల్సిన ప్రదేశాలను ఫిక్స్ చేసుకోవడం, అత్యాధునికమైన కెమెరాలతో ఫోటోలు, వీడియోలు షూట్ చెయ్యటానికి ఎంత ఖర్చైనా వెనకాడటం లేదు.

శృతి మించుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్
రక రకాల భంగిమలను ప్రీ వెడ్డింగ్ షూట్ ముందుగానే ప్రిపేర్ అవడం ఒక ఆనవాయితీగా మారిపోతుంది. ఇక రొమాంటిక్ సాంగ్స్ కోసం డ్యాన్సులు నేర్చుకోవటానికి డ్యాన్స్ క్లాసులకు కూడా వెళ్తున్న వారు లేకపోలేదు. సినిమాలలోని ఫోజులను తలపిస్తూ నూతనంగా వివాహం చేసుకోబోయే వధూవరులను రకరకాల భంగిమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మరీ శృతి మించుతున్నాయి.

ఆలయం ఆవరణలో తల్లక్రిందులుగా వరుడు.. పక్కనే డ్యాన్స్ చేసిన వధువు
ఇక ఇటీవల ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్ యాక్షన్ సినిమాను తలపించింది. బైక్ పై స్టంట్ చేస్తూ క్రేన్ సహాయంతో ఆ బైక్ ఓ పెద్ద కారు పైనుండి లాగుతూ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన వారు ఏదైనా బాలీవుడ్ సినిమా తీస్తున్నారా అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది ప్రీ వెడ్డింగ్ షూట్ . ఇక ఇది మరిచిపోకముందే ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో ఒక ఆలయం ఆవరణలో పెళ్లి కొడుకును తలకిందులుగా పెట్టి, పక్కన పెళ్లి కూతురు డాన్స్ చేస్తున్న వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో వైరల్.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పెళ్లి కొడుకు పాపం తలకిందులుగా చాలాసేపు ఉండవలసి వచ్చింది. ఇక అతని పక్కనే పెళ్లి కూతురు క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ఇక ఆ తర్వాత కాసేపు పెళ్లికూతురును ఎత్తుకోవడానికి పెళ్ళికొడుకు నానా తంటాలు పడ్డాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో, పెళ్ళికొడుకుని తలకిందులుగా చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందే పరిస్థితి ఇలా ఉంటే... పాపం పెళ్లయిన తర్వాత మనోడి పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మాకైతే ఇలాంటి పెళ్లి వద్దు బాబోయ్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications