Vijay Devarakonda: దొరికిపోయిన విజయ్ దేవరకొండ - బయటపడేదెలా..!!

హీరో విజయ్ దేవరకొండ కొత సమస్యలో చక్కుకున్నారు. ఖుషీ మూడ్ లో తాజాగా విజయ్ చేసిన ప్రకటనతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. కొంత కాలంగా విజయ్ కు సరైన సక్సెస్ లేదు. తాజాగా ఖుషీ సినిమా హిట్ టాక్ రావటంతో విజయ్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించాడు. ఇప్పుడు ఆ ప్రకటనే కొత్త సమస్య గా మారుతోంది.

విజయ్ ఖుషి మూవీతో:ఖుషి సక్సెస్ టూర్ లో ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఆ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ లో ఒక ప్రకటన చేసారు. తన సినిమాకు మంచి టాక్ వచ్చినా కొందరు డబ్బులిచ్చి నెగెటివ్ ప్రచారం చేయించారని వ్యాఖ్యానించారు. తన అభిమానుల వలనే తన సినిమా ఆడుతోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తానని ప్రకటించారు. ఫ్యాన్స్ కోసం తాను ఆర్దికంగా అండగా నిలబడతానని వెల్లడించారు. లక్ష మందికి లక్ష చొప్పున కోటీ రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విజయ్..ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ ఆ ప్రకటన చేసినప్పటినుండి అభినులు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.

Abhishek Picutres Counter to Vijay Devarakonda, aking to compesnate Money for Rs 8 Cr

కోటి సాయం ప్రకటనతో:ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక లక్ష ఇస్తాను, మీ ప్రేమ, మీ ఆదరణే నా సినిమాని బ్రతికించింది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ జబితాలో డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఉన్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీసుల ముందు బోర్లా పడ్డాయి. ఇప్పుడు ఖుషీ సక్సెస్ ఈవెంట్ లో కోటి ప్రకటన చేసిన విజయ్ ను ఉద్దేశించి ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది. ఇబ్బందుల్లో ఉన్న వారికి లక్ష చొప్పున ఇస్తానని ప్రకటించిన విజయ్.. తమకు అండగా నిలవాలంటూ ఆ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

రూ 8 కోట్లు నష్టపోయామంటూ:అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ ట్వీట్ చేసింది. అందులో.."నీ సినిమా డియర్ కామ్రేడ్ ని కొని మేము 8 కోట్లు నష్టపోయాము. అప్పుడు ఎవరూ ఇలా స్పందించలేదు. మీరు కోటి రూపాయలు అభిమానుల కోసం విరాళం ప్రకటించారు. మీది పెద్ద మనసు. మిమ్మల్ని దయ చేసి కోరుకునేదేమిటంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ కొన్న ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా పెద్ద మనసుతో సహాయం చెయ్యాలని అభ్యర్దిస్తున్నాము.." అంటూ అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుండి పడిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక, ఇప్పుడు దీని పైన విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+