హోం మంత్రి సుచరితనూ వదలని నెటిజన్ .. అసభ్యంగా పోస్ట్ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు
ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత పట్ల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్టు పెట్టటంతో అది కాస్తా వైరల్ గా మారింది . దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో మంత్రి సుచరితపై అసభ్యకరమైన పోస్టు పెట్టాడు. చెప్పలేని విధంగా, రాయకూడని భాషలో పరుష పదజాలంతో ఆమెను ఆ పోస్ట్ లో దూషించాడు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమన్న మంత్రి సుచరిత వ్యాఖ్యలపై అసభ్యకర పోస్ట్ పెట్టిన నెటిజన్ .. డీజీపీకి ఫిర్యాదు
నేరం జరిగిన ప్రతీచోటా కాపలా ఉండలేమని హోం మంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నంకు చెందిన రాం మహారాజ్ అనే వ్యక్తి అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారు. చాలా అభ్యంతరకరంగా ఆమె గురించి రాశారు. ఇక పోస్ట్ లపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి సుచరితను ఉద్దేశించి అగౌరవంగా, అసభ్యకరంగా పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అశోక్ కుమార్ అనే వ్యక్తి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు.

రామ్ మహారాజ్ అనే వ్యక్తి పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు .. దర్యాప్తు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
రామ్ మహారాజ్ అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఈ పోస్టు పెట్టినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులుఅసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తి రాం మహారాజ్ అనే వ్యక్తి అని గుర్తించి గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొత్తపట్నంకు చెందిన రామ్ మహారాజ్ గా గుర్తించిన పోలీసులు అతనే మంత్రి సుచరితపై అసభ్య పోస్ట్ పెట్టినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు
గుంటూరు అర్బన్ ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ కులశేఖర్, సీఐ కల్యాణ రాజు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి అందులోనూ మహిళపై అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినందుకు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారని సమాచారం . అయితే ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు పోలీసులు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications