హాస్టల్స్‌లో ఒంటరి మహిళలపై 'రేప్'.. పక్కా స్కెచ్‌తో పట్టేసుకున్నారు

నగరంలో ఒంటరిగా ఉండే మహిళలను, ముఖ్యంగా హాస్టళ్లలో ఒంటరిగా ఉండేవారిని టార్గెట్ చేసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు.

బెంగుళూరు: ఒకసారి జైలుకెళ్లి వచ్చినా.. అతగాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా! మరో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేశాడు. హాస్టళ్లలో ఒంటరిగా ఉండే మహిళలనే టార్గెట్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్న అతగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన శివరామరెడ్డి(31) గత 15ఏళ్లుగా బెంగుళూరులో ఉంటున్నాడు. 2014లొ రేప్ కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. 2015లో జైలు నుంచి విడుదలైనా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నగరంలో ఒంటరిగా ఉండే మహిళలను, ముఖ్యంగా హాస్టళ్లలో ఒంటరిగా ఉండేవారిని టార్గెట్ చేసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు.

Accused Of Several Rapes, Bengaluru Man Shivarama Reddy Let Off, Is Arrested For Another

ఇదే క్రమంలో ఈ నెల 2న ఓ హాస్టల్లోకి చొరబడ్డ శివరామరెడ్డి 23ఏళ్ల ఓ యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో హాస్టల్లోని ఓ యువతిపై కూడా ఇదే తరహాలో దాడికి పాల్పడి కొన్ని విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలించగా శివరామరెడ్డే ఆ నిందితుడని నిర్దారించారు. అతని పాత ఫోటో ఆధారంగా బాధితులు నిందితున్ని గుర్తించారు. కాగా, పక్కా స్కెచ్ తో పోలీసులు శివరామరెడ్డిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. ఆ సమయంలో.. ముగ్గురు పోలీసులపై శివరామరెడ్డి కత్తితో దాడికి తెగబడ్డాడు.

దీంతో శివరామరెడ్డి కాలిపై కాల్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2013-14లోను నిందితుడిపై పలు లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని మీద 16కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+