జగన్‌కు బుర్ర ఉందనే అనుకున్నా.. కానీ: అచ్చెన్నాయుడు సెటైర్లు

Subscribe to Oneindia Telugu

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే ఓటుకు నోటు కేసుపై చర్చించాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళ చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార పక్షం సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్‌కు బుర్రే లేదు: అచ్చెన్నాయుడు

achennayudu lashes out at ys jagan

ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు బుర్ర పని చేయడం లేదని ఇంతకాలమూ అనుకుంటూ వచ్చానని.. ఈ విషయంలో తాను తప్పుడు అభిప్రాయంతో ఇన్నాళ్లూ ఉన్నానని.. నేడు అసెంబ్లీలో ఆయన వైఖరి చూస్తుంటే, అసలు బుర్రే లేదని అర్థమైందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళకు దిగారు.

శుక్రవారం పది నిమిషాల పాటు వాయిదా పడ్డ అసెంబ్లీ, తిరిగి సమావేశం కాగానే, ఓటుకు నోటు కేసులో తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని వైసీపీ పట్టుబట్టింది. ఆ పార్టీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండటంతో, పలువురు తెలుగుదేశం సభ్యులు వైసీపీ వైఖరికి నిరసన తెలుపుతూ ప్రతి నినాదాలు చేశారు.

ఈ కేసు ఓ పనికిమాలినదని చెప్పారు. దీనిపై చర్చే అవసరం లేదని తేల్చారు. మంత్రి పత్తిపాటి సవాలును స్వీకరిస్తున్నారో లేదో జగన్ చెప్పాలన్నారు. సవాలును అంగీకరిస్తే న్యాయ విచారణకు ఆదేశిస్తామని అన్నారు.

ప్రత్తిపాటి చేసిన సవాల్‌ను జగన్‌ స్వీకరించాలని.. లేందటే తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తేలేవరకు వేరే అంశంపై ముందుకెళ్లడానికి తాము ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, తమపై అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నా స్పీకర్ చూస్తూ మిన్నకుంటున్నారని వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.

పక్క రాష్ట్రం కేసు: ధూళిపాళ్ల

ఓటుకు నోటు ఈ రాష్ట్రానికి సంబంధించినది కాదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినదని అన్నారు. గుంటూరు మిర్చియార్డులో మొసలికన్నీరు కారుస్తున్నారంటూ జగన్ పై మండిపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Achennayudu on Friday lashed out at YSR Congress Party president YS Jaganmohan Reddy in assembly.
Please Wait while comments are loading...