పండుగల వేళ TGSRTC భారీ షాక్, ఛార్జీల పెంపు - ఇక ఇలా ..!!

వరుస పండుగల వేళ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ మేరకు రూట్లను ఖరారు చేసింది. ప్రధానం గా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతో, ఆ రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ నెల 23వ తేదీ తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి ప్రత్యేక బస్సుల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది.

ఉగాది, రంజాన్ వరుస సెలవులతో సొంత ఊర్లకు వెళ్లే వారితో రద్దీ ఏర్పడనుంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.

TGSRTC will operate special buses during Ugadi amp amp Ramzan in busy routes with Additional rates here the details

ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ 2023లో జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇప్పుడు ఛార్జీలను సవరించినట్లు టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలు చేస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసారు. కేవలం పండుగ కారణంగా తిప్పే ప్రత్యేక బస్సుల్లోనే ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉంటాయని, ప్రయాణికులు దీనిని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం అమలు

కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం యథాతధంగా వర్తిస్తుందని, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండనుంది. కాగా, పండుగల వేళ ఈ స్పెషల్ బస్సులు 17,18వ తేదీలతో పాటు 23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. ఉగాది, రంజాన్ పండుగల ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+