బాలకృష్ణతో కలిసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న శివాజీ!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఆపై రాజకీయాలలో తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చిన శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా రాజకీయాలలో కొనసాగారు. ఆ తరువాత అనేక కారణాలతో మళ్లీ నటుడిగా బిజీ కావాలని ప్రయత్నించిన శివాజీ, తన కెరీర్ ను మళ్లీ తీర్చి దిద్దుకోవటానికి బిగ్ బాస్ షో ను వేదికగా ఎంచుకున్నారు.
ఇక ఈ షోలో తనదైన క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసిన శివాజీ టాప్ 3 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచారు.ఆ తర్వాత ఇటీవల ఈటీవీ సంస్థ తీసిన ఒక వెబ్ సిరీస్ లో నటించిన శివాజీకి అతని నటన బాగుందని ప్రశంసలు కూడా అందాయి. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత కి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించని శివాజీ ఆ అవకాశాలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో తాజాగా శివాజీ బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించడానికి రంగం సిద్ధమవుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు శివాజీ తో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం.
బాలకృష్ణ బోయ పార్టీల కాంబినేషన్ లో ఈ సంవత్సరం ప్రారంభం కాబోయే ఒక సినిమాలో నెగిటివ్ రోల్ చేయనున్న శివాజీ ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. గతంలో 'ఒట్టేసి చెబుతున్నా' తో పాటు మరికొన్ని సినిమాలలో శివాజీ నెగిటివ్ పాత్రలలో నటించినప్పటికీ అప్పుడు పెద్దగా ఆయనకు గుర్తింపు రాలేదు.
మరి ఇప్పుడైనా శివాజీ బాలయ్య సినిమాతో గుర్తింపును సాధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సినిమాతో శివాజీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications