శృంగార తార సిరిప్రియ ఇష్యూ: అతనేమంటున్నాడు, అసలు చిక్కులేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: లఘు చిత్రాల్లో శృంగార తార సిరిప్రియకు కష్టాలు ఎందుకు వచ్చాయి, ఆమెను పెళ్లి చేసుకున్న యువకుడు ఏ వైపు ఉన్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వృత్తిపరమైన జీవితాన్ని సాకుగా చూపి తన భర్త తరఫు తమ పెళ్లిని అంగీకరించదడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్‌లో శృంగార సన్నివేశాల్లో నటించినంత మాత్రాన తమ వ్యక్తిత్వం చెడిపోయిందని ఎలా అంటారని సిరిప్రియ అడుగుతోంది. ఇంజనీరింగ్ చదివే కుర్రాడు ప్రసన్నకుమార్ మాత్రం సిరిప్రియతో కలిసే ఉంటానని చెబుతున్నాడు.

పోలీసుల్ని ఆశ్రయించిన రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్, ఏం జరిగిందంటే..

యూట్యూబ్ ఛానెల్స్ రోమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సిరిప్రియ చాలా మందికి పరిచయం. సిరిప్రియ, ఇంజనీరింగ్ చదువుతున్న ప్రసన్నకుమార్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి పెద్దలు, ముఖ్యంగా ప్రసన్నకుమార్ తరఫువారు అంగీకరించలేదు. అయినా ఇరువురు వివాహం చేసుకున్నారు.

Actress Sriripriya in trouble because of short films

ఈ స్థితిలో తమకు రక్షణ కల్పించాలంటూ సిరిప్రియ, ప్రసన్నకుమార్ దంపతులు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. హైద్రాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటున్న చంద్రకళ అలియాస్ సిరిప్రియ శృంగారపరమైన లఘు చిత్రాల్లో నటించింది. ఆమె కోరిత అనే సినిమాలో కూడా నటించింది. అది విడుదలకు సిద్ధంగా ఉంది.

అడల్ట్ ఫిల్మ్ లలో నటనే....హీరోయిన్ కాపురంకు దెబ్బ ,పోలీసుల దగ్గరకు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రసన్నకుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సిరిప్రియతో ఫేస్‌బుక్ ద్వారా అతనికి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఆరేళ్ల తర్వాత ఇటీవలే ఓ చర్చ్‌లో పెళ్లి చేసుకున్నారు. ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు సిరిప్రియ వృత్తి జీవితాన్ని సాకుగా చూపి పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. ప్రసన్నకుమార్ తండ్రి పోలీసు అధికారి అని తెలుస్తోంది.
అయితే ప్రసన్న కుమార్ బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని సిరిప్రియ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తను రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాను తప్ప ఎప్పుడూ హద్దులు మీరి వ్యవహరించలేదని సిరిప్రియ అంటోంది. సిరిప్రియను తాను వదులుకోనని, ఈ విషయాన్నే తన తల్లిదండ్రులకు చెప్పానని ప్రసన్న కుమార్ చెబుతున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Romantic actress Siripriya alias Chandrakala and her husband, a Btech student Prasann Kumar wanted to live togetther. They alleged that they are facing threat from the Prasannakuar's family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి