వచ్చెయ్, అప్పుడే వద్దన్నా: జగన్‌కు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత జగన్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు!

వైసిపి మూసేసి టిడిపిలో విలీనం చేయాలి

వైసిపి మూసేసి టిడిపిలో విలీనం చేయాలి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నానని చెప్పిన జగన్ ఇక తన పార్టీని మూసేసి తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఆనాడే విభేదించా

ఆనాడే విభేదించా

బీజేపీని రెండు అంశాల్లో విభేధిస్తున్నామని చెప్పిన జగన్.. కేసుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట మోకరిల్లారన్నారు. 2014 మే 16న కౌంటింగ్ తర్వాత ప్రధాని మోడీని, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను జగన్ కలవడాన్ని తాను అప్పుడే వ్యతిరేకించానని అన్నారు.

రాజీనామాలపై యూ టర్న్

రాజీనామాలపై యూ టర్న్

ప్రత్యేక హోదా కోసం వచ్చే నెలలో తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో జగన్ రాజీపడ్డారని, ఆన ఓ కలుపుమొక్క అన్నారు.

జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

అలాంటి జగన్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసిపి నుంచి వచ్చిన సుజయ కృష్ణ రంగారావు, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు మంత్రులు అయ్యారు. ఇటీవల వారు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Adinarayana Reddy offer to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...