Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే: పింక్ చిత్రం షూటింగ్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్

పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేశాక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా గడిపిన జనసేనాని పింక్ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. వేణు శ్రీరాం పింక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్‌ ఈ చిత్రం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. హిందీ చిత్రంలో ఈ పాత్ర బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషించారు.

గడ్డంతోనే షూటింగ్‌లో పాల్గొన్న పవన్

గడ్డంతోనే షూటింగ్‌లో పాల్గొన్న పవన్

ఇదిలా ఉంటే ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిపి బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. బే వ్యూ ప్రాజెక్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై పింక్ రీమేక్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే పవర్ స్టార్ గడ్డంతోనే షూట్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే చిత్రంకు సంబంధించి కోర్టు హాలు సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సెట్‌లోనే పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రీఎంట్రీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ అయ్యిందన్న విషయం దావనంలా పాకడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు

పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు

చిత్రంలో హీరో పాత్ర గత జీవితంకు సంబంధించి కొన్ని పాటలు కూడా ఉండటంతో ఆ సీన్లలో పవన్ కళ్యాణ్ గడ్డం తీసేస్తారని సమాచారం. అయితే ఒరిజినల్ పింక్ స్టోరీలో పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అంతేకాదు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మలిచినట్లు సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫైట్ సీన్లను పాటలను కూడా దర్శకుడు వేణు శ్రీరాం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

 పూజా హెగ్డేకు ఆ ఛాన్స్ దక్కిందా..?

పూజా హెగ్డేకు ఆ ఛాన్స్ దక్కిందా..?

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరై ఉంటారనే సస్పెన్స్ కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ దక్కించుకోబోయే ఆ హీరోయిన్ కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. అయితే పొడగు కాళ్ల సుందరి మాంచి ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డే పింక్ చిత్రంలో పవన్ సరసన ఛాన్స్ దక్కించుకుందని ఫిలింనగర్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎవరూ అధికారికంగా నిర్థారించలేదు. మరో వారం లేదా రెండు వారాల సమయంలో పవన్ పక్కన హీరోయిన ఎవరో తెలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరోవైపు అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ తమన్ పవర్ స్టార్ చిత్రానికి పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ అందించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+