దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!

ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా, ఉమ్మడి కృష్ణాజిల్లా ఇన్ ఛార్జ్ గా, టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల మంత్రిగా కూడా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈసారి కాలం కలిసిరాలేదు. వివిధ కారణాలతో ఆయన ఇన్ ఛార్జ్ గా ఉన్న మైలవరం సీటు ప్రత్యర్ధి పార్టీ వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు వెళ్లిపోయింది.

ఇతర సీట్లలో పరిశీలించినా ఏదీ ఇచ్చే పరిస్దితి లేదు. దీంతో దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న ఉమకు చంద్రబాబు ఇప్పుడు కీలక బాధ్యత అప్పగించారు.

after denying ticket channdrababu gives key responsibility to former minister devineni uma

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు నేపథ్యంలో దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగిస్తూ ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్తగా దేవినేని ఉమను నియమిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది. అంటే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల మధ్య సమన్వయం చేసే బాధ్యత ఉమకు అప్పగించారు.

after denying ticket channdrababu gives key responsibility to former minister devineni uma

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్డీయేతో పొత్తు కారణంగా పలువురు టీడీపీ సీనియర్లకు సీట్లు దక్కలేదు. దీంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో కొందరు రెబెల్స్ గా పోటీ చేసేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఇలాంటి సీట్లలో వారిని బుజ్జగించి అక్కడ పోటీ చేస్తున్న ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్ధులకు ఓట్లు వేసేలా చేయడం ఈ సమన్వయ కర్త బాధ్యత అని భావిస్తున్నారు. దీంతో దేవినేని ఉమ ఈసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+