అంబటికి డబుల్ బొనాంజా..! హైకోర్టు తర్వాత గుంటూరు కోర్టులో..!
వైఎస్సార్సీపీ కీలక నేత అంబటి రాంబాబు(ambati rambabu)కు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇవాళ మరో భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇవాళే అంబటిపై దాఖలైన 35 కేసుల్లో ఊరటనివ్వగా.. మిగిలిన ఒక్క కేసులోనూ గుంటూరు కోర్టులో ఆయనకు ఊరట దక్కింది.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుపై గుంటూరులోని నల్లపాడు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదే కేసులో ఆయన్ని రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఉదయం కోర్టులో హాజరుపర్చడంతో పాటు రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపేశారు. అప్పటి నుంచీ ఆయన రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. అదే సమయంలో అంబటిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంబటి తనకు బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన గుంటూరు కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.

మరోవైపు తాజా పరిణామాలను ముుందే ఊహించిన పోలీసులు.. గతంలో మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం అమలు సందర్భంగా గుంటూరులో నిరసనలకు దిగిన నమోదైన కేసులో ఆయన్ను ఇవాళ రాజమండ్రి జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభిస్తే తప్ప ఆయన జైలు నుంచి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి గుంటూరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశాాలు కనిపిస్తున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications