Chandrababu: సీఎంగా చంద్రబాబు మూడు సంతకాలు వీటిపైనే..!

ఏపీలో ఈ నెల 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత మూడు కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు. వీటిపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణస్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే మూడు సంతకాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో మూడు కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చారు. వీటిలో మొదటిది మెగా డీఎస్సీ నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించేయాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హామీ ఇచ్చారు.

after oath Chandrababu to put first three signatures on these key promises

చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూహక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే భూహక్కు చట్టం రద్దు చేయనున్నారు.

ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను ఐదేళ్లలో 2 వేల నుంచి 3 వేలకు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారమిస్తే వెంటనే 3 వేల పెన్షన్ ఇస్తానన్నా జనం నమ్మలేదు. కానీ జగన్ అదే మూడు వేలు ఇస్తారని భావిస్తే దానికి ఐదేళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతే కాదు పెరిగిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి మూడువేలు, జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తం 7 వేలు ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+