స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. విజయవాడ వైసీపీలో భారీ చేరికలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 46వ డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రతినిధులు దాదాపు 200 మంది ఆ పార్టీలో చేరారు. ఈ వరుస చేరికలతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవాహం వ్యక్తమౌతోంది.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వాళ్లంతా వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ భారీ చేరికలే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందించిన పరిపాలన, అర్హులైన ప్రతి పేదవాడికి చేరిన సంక్షేమ పథకాలే నేటికీ తమ పార్టీకి బలమైన పునాదిగా నిలిచాయని వ్యాఖ్యానించారు.

Ahead of Urban Local Body Elections in Andhra Pradesh Several Joining in YSRCP in Vijayawada West

ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన తీరు చూసే ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా వైసీపీ వైపు వస్తోన్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో 46వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న తుపాకుల శ్రీలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని వెల్లంపల్లి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన కొత్త నాయకులను, కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తామని హామీ ఇచ్చారు.

విజయవాడ, గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థులు వీళ్లే: సెకెండ్ లిస్ట్ లో.. !!
విజయవాడ, గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థులు వీళ్లే: సెకెండ్ లిస్ట్ లో.. !!

డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా శ్రమించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా నగరాలు సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని వైఎస్ఆర్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో 200 మందికి పైగా ఆ పార్టీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+