పవన్ అంటేనే ఇష్టం.. వైసీపీ నుంచి బయటకి వచ్చాక అలీ సంచలన కామెంట్

నటుడు అలీ రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరుఫున అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు.

అయితే ఆయను మొండిచేయి ఎదురైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశ భంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ అభిమానులు అలీపై దారుణంగా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సైతం అలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు. పవన్ తనపై చేసిన కామెంట్స్‌కు అలీ కూడా గట్టిగానే కౌంటరిచ్చారు.

Ali spoke about Pawan after he came out of politics

అప్పటి నుంచి అలీ, పవన్ కల్యాణ్‌ల మధ్య గ్యాప్ వచ్చింది. అలీ రాజకీయాల నుంచి తప్పుకుని , తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సుమ అడ్డ షోకు ఆయన అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో సుమ అలీని కొన్ని ప్రశ్నలు అడిగింది. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది. ఆన్ స్క్రీన్ లో ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టం అని సుమ అడిగింది. రవితేజ, పవన్ కళ్యాణ్ అని ఆప్షన్స్ ఇచ్చింది. అలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్‌తో కాంబినేషన్ అంటే తనకు ఇష్టం అని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+