Allu Arjun : అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం - గ్లోబల్ రేంజ్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌(Madame Tussauds Dubai)లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. అల వైకుంఠ పురం సినిమాలో బోర్డు రూమ్ సన్నివేశంలో అల్లు అర్జున్ ధరించిన రెడ్ జాకెట్ తో ఆయన బొమ్మ కొలువు దీరనుంది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మైనపు విగ్రహం: పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డు సాధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌ సంస్థ దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. దీని కోసం అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్లి తన కొలతల్ని ఇచ్చారు.

All set for Hero Allu Arjun wax statue at Madame Tussauds Dubai this year

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలు ఉన్నాయి. పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి ఆయా మ్యూజియంలలో ఆవిష్కరిస్తుంటారు. అయితే, అల్లు అర్జున్ వైకుంఠపురంలో రెడ్ జాకెట్ తో కనిపించిన విధంగా ఇప్పుడు ఈ మైనపు విగ్రహం సిద్దం అవుతోంది.

రెడ్ జాకెట్ లో బన్నీ: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ఫ -2లో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందు మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారి విగ్రహాలను పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. వారి విగ్రహాలను 'మేడమ్ టుస్సాడ్స్'కు చెందిన సింగపూర్, బాంకాక్ వంటి చోట్ల ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో మాత్రం అల్లు అర్జున్ విగ్రహమే ఫస్ట్ అని చెబుతున్నారు.

Allu Arjun wax statue

దుబాయ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో ఈ ఏడాదే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మేడమ్ టుస్సాడ్స్ పేర్కొంది. అంతేకాదు బన్నీ నుంచి కొలతలు తీసుకున్న వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. టుస్సాట్స్‌లో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. ఇది తనకు ఓ రకంగా ప్రత్యేకమైన అనుభూతి అన్నారు.

ప్రత్యేక గుర్తింపు: తాను చిన్నతనంలో టుస్సాడ్స్‌ను సందర్శించిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి డిటైల్డ్‌గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడినా.. ఎవరు నార్మల్ పర్సనో కనిపెట్టడం కష్టమయ్యేంత అద్భుతంగా ఈ మైనపు విగ్రహాలను రూపొందిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని అలా అంతా చూడబోతున్నారు. తన విలక్షణమైన నటనతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ అరుదైన గౌరవంతో మరింత ఇమేజ్ పెరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+