రూ.4లకే భోజనం పథకాన్ని ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిహెచ్ఎంసి లో పేద ప్రజల కడుపునింపుతున్న రూ.5 భోజనం తరహాలోనే తన నియోజకవర్గంలో రూ. 4 లకే భోజనం పెట్టే పథకాన్ని ఆదివారం నాడు ప్రారంభించాడు.ఇటీవల ఆయన హైద్రాబాద్ లోని జిహెచ్ఎంసి లో నిర్వహిస్తున్న రూ.5 భోజనం పథకాన్ని స్వయంగా పరిశీలించాడు.

జిహెచ్ ఎంసి తరహాలోనే తన నియోజకవర్గంలో కూడ ఈ తరహా భోజనాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు జిహెచ్ ఎం సిలో నిర్వహిస్తున్న భోజన పథకాన్ని పరిశీలించినట్టు చెప్పారు. చెప్పినట్టుగానే తన నియోజకవర్గంలో మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించాడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరి నియోజకవర్గంలో ఈ క్యాంటీన్లు పేదలకు రూ.4 లకే భోజనాన్ని అందించనున్నారు.

alla ramakrishna reddy

జిల్లాలోని గౌతమిబుద్ద రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ లో తొలి పదిరోజులు, మిగిలినరోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో ఈ క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేయనున్నట్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు.

రూ.4 లకే అన్నం, కూర , పప్పును అందించనున్నారు. 4 రోజుల పాటు కోడిగుడ్డు, మూడు రోజులపాటు అరటిపండు, వడియాలు, వాటర్ ప్యాకెట్ లను అందించనున్నారు. ప్రతిరోజూ మూడు నుండి ఐదువందల మందికి భోజనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.

అయితే ఈ మొబైల్ క్యాంటీన్లకు ఎమ్మెల్యే తన స్వంత డబ్బులను వెచ్చిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రోజునే ఈ మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.

పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతోనే రాజన్న క్యాంటీన్ అనే పేరును ఈ మొబైల్ క్యాంటీన్లకు పెట్టారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.అందుకే తాను రాజన్న క్యాంటీన్లను తీసుకువచ్చినట్టు చెప్పారు. త్వరలో రాజన్న క్యాంటీన్లలో టిఫిన్ ను కూడ అందించనున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp MLA Alla Ramakrishna Reddy started mobile canteen in his assembly segment on Sunday. for Rs.4 get meals per poor people.he observed GHMC five rupees canteen scheme in Hyderabad recently.
Please Wait while comments are loading...