వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీలో బిజెపికి 8, 45 సీట్లు: సీమాంధ్రపై సస్పెన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Alliance between BJP and TDP finalised
న్యూఢిల్లీ: తెలుగుదేశం, బిజెపి మధ్య పొత్తు కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సీట్ల సంఖ్యపై ఇరు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయి. సీమాంధ్రలో లెక్కలు మాత్రం ఇంకా తేలలేదు. తొలుత సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వస్తే ఆ తర్వాతే ఎవరికి ఏ స్థానం కేటాయించాలనే దానిపై చర్చలుంటాయని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి 8 లోక్‌సభ, 45 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయటంతో పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది.

సీమాంధ్ర స్థానాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారంనాడు అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ నివాసంలో బిజెపి అగ్రనేతలు జైట్లీ, జవదేకర్, తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణరావు, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. అయితే, చర్చలు వాయిదా పడ్డాయి సీమాంధ్రలో 4 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది.

5 లోక్‌సభ, కనీసం 15 అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అవి కూడా తమకు నచ్చిన స్థానాలు కేటాయించాలని గట్టిగా అడుగుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఏది ఏమైనా బుధవారం ఉదయానికి చర్చల్ని ముగిస్తామని, వెంటనే పొత్తుపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని వారు వెల్లడిస్తున్నారు. సీట్ల సంఖ్యపై అవగాహన వచ్చేస్తే ఏయే స్థానాలు కేటాయించాలన్న దానిపై కూడా తక్షణం చర్చించేందుకు వీలుగా తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికే ఢిల్లీలో సిద్ధంగా ఉన్నారు.

బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. తాము చెప్పాల్సింది ఇప్పటికే తమ అధిష్ఠానం పెద్దలకు చెప్పేశామని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారంటున్నారు. చర్చల మధ్యలో బీజేపీ అధిష్ఠానం పెద్దలు తమ రాష్ట్ర శాఖ నాయకులతో ఫోన్లో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు సమాచారం.

English summary
Alliance between Telugudesam and BJP has been finalised in Telangana. Suspense is continuing regarding Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X