అల్లు అర్జున్‌తో మెగాస్టార్ రాజీ- పవన్ మాటేంటి?

Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. కొద్దిసేపటి కిందటే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. బ్లాక్ కలర్ టీజీ 09 4666 కారులో మెగా కాంపౌండ్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు బన్నీ. ఆ సమయంలో అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహా రెడ్డి ఉన్నారు.

చాలాకాలం తరువాత ఇంటికి వచ్చిన తన మేనల్లుడిని చిరంజీవి, ఆయన భార్య సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి దంపతులకు నమస్కరించారు. ఎట్టకేలకు అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి గడప తొక్కడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.

Allu Arjun meets Chiranjeevi meets at his residence How About Pawan Kalyan

మెగా కాంపౌండ్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో చాలాకాలం పాటు ఆయన చిరంజీవి కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌తో కుటుంబ బాంధవ్యాలను పునరుద్ధరించుకునే క్రమంలో చిరంజీవి ఓ అడుగు ముందుకు వేసినట్టయింది. పెద్దరికం తీసుకున్నట్టయింది. రాజీ ఫార్ములాను అనుసరించినట్టయింది. ఫోన్ చేసి మరీ ఇంటికి ఆహ్వానించారాయన అల్లు అర్జున్‌ను.

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన తరువాత మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

అల్లు అర్జున్‌ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని తెలుస్తోంది. రాత్రికి ఆయన ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు దర్శక మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారంటూ లీకులు సైతం వెలువడ్డాయి.

వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. అలా జరగలేదు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండానే పవన్ కల్యాణ్ ఏపీకి తిరుగుముఖం పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటైన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమం ఉండటం వల్లే పవన్ కల్యాణ్ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన మళ్లీ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారని, ఈ సాయంత్రం అల్లు అర్జున్‌ను ఇంటికి వెళ్లి కలుసుకుంటారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+