ఎట్టకేలకు మెగాస్టార్ ఇంటి గడప తొక్కిన అల్లు అర్జున్: పుల్‌స్టాప్..?!

Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆయన భారీ బందోబస్తు మధ్య తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి, ఆ తరువాత ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సినీ ప్రముఖులు పోటెత్తారు. ఆప్యాయంగా పలకరిస్తోన్నారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

Allu Arjun meets Megastar Chiranjeevi meets at his residence

దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరోలు నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దర్శకుడు హరీష్ శంకర్, అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్.. ఇలా దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ అల్లు అర్జున్‌ను పలకరించిన వారిలో ఉన్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. కొద్దిసేపటి కిందటే చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. బ్లాక్ కలర్ టీజీ 09 4666 కారులో మెగా కాంపౌండ్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు బన్నీ. ఆ సమయంలో అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహా రెడ్డి ఉన్నారు.

చాలాకాలం తరువాత ఇంటికి వచ్చిన తన మేనల్లుడిని చిరంజీవి, ఆయన భార్య సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి దంపతులకు నమస్కరించారు.

ఎట్టకేలకు అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి గడప తొక్కడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. మెగా కాంపౌండ్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో చాలాకాలం పాటు ఆయన చిరంజీవి కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి సోదరుడు నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్‌ను విమర్శిస్తూ ట్వీట్లు, కామెంట్లు పోస్ట్ చేస్తూ వచ్చారు.

కొణిదెల సురేఖ శనివారమే అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడిని పలకరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టారు. ఆ సమయంలో సురేఖ సోదరుడు అల్లు అరవింద్ పక్కనే ఉన్నారు. చెల్లెలికి ధైర్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+