Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగబాబుకు పాలు పోసి పెంచిన గీతా ఆర్ట్స్‌: బయటికొచ్చిన కొత్త విషయాలు

Allu Arjun: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్.. ఒక వైపు- మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు నిలిచాయి. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు.

Allu Arjun row Former Janasena leader Pothina Mahesh lashes out at Nagababu

పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ- ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ వైఖరిని తప్పు పడుతూ పోలింగ్ ముగిసిన రోజున జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం.

దానిపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. ఈ ట్వీట్- నాగబాబును విమర్శలకు కేంద్రబిందువుగా మార్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా నాగబాబుకు రిప్లైలు పెట్టారు. దీనితో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, జనసేన మాజీ నాయకులు నాగబాబును వదలట్లేదు.

తాజాగా- వైఎస్ఆర్సీపీకి చెందిన పోతిన మహేష్.. నాగబాబుపై ఘాటు విమర్శలు సంధించారు. నాగుపాముకు పాలు పోసినా అది కాటు వేస్తుందని, నాగబాబు కూడా అలాంటి వాడేనని అన్నారు. వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా? అంటూ చురకలు అంటించారు.

Allu Arjun row Former Janasena leader Pothina Mahesh lashes out at Nagababu

తమకు సహాయం చేసిన వారి పట్ల ఏ మాత్రం కృతజ్ఞత మెగా కుటుంబానికి లేదని పోతిన మహేష్ ఆరోపించారు. తన మామయ్య నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో అల్లు అర్జున్ తన నా పేరు సూర్య సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పెట్టించారని, సినిమా పూర్తికాకముందే మూడు కోట్ల రూపాయలను ఇప్పించారని గుర్తు చేశారు.

దీనితో పాటు నాగబాబుకు మరో రెండు సినిమాల్లో పాత్రలను సైతం అల్లు అర్జున్ ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని చెప్పారు. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల రూపాయల ఫండ్ సైతం ఇచ్చాడని పేర్కొన్నారు. అయినా అల్లు అర్జున్‌పై నాగ బాబు విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. అండగా నిలిచిన వారు, గీత ఆర్ట్స్ కుటుంబంపైనే నాగబాబు అక్కసు వెళ్లగక్కుతున్నాడని, మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+