అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 తేదీలు వచ్చేశాయ్ .. హర్రీ అప్!!
పండుగల సీజన్ వచ్చేసింది. బోలెడన్ని అద్భుతమైన ఆఫర్లతో ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు వినియోగదారులకు ఫెస్టివల్ సేల్ అందించడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలను ప్రకటించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నాయని amazon వెల్లడించింది. అక్టోబర్ 8వ తేదీ నుండి ఈ సేల్ ప్రారంభం అవుతుందని ఈ మేరకు అమెజాన్ ధ్రువీకరణ చేసింది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అక్టోబర్ 7వ తేదీ అర్ధరాత్రి నుండి సేల్ ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుంది అనేది మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.

దీపావళి వరకు ఈ సేల్ ప్రక్రియ కొనసాగుతుందన్న ఆశాభావం అందరిలో వ్యక్తమవుతుంది. సేల్స్ సమయంలో amazon మొబైల్ మరియు ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ పై 40 శాతం వరకు తగ్గింపునిస్తుంది. alexa, fire tv, kindle పై 55 శాతం వరకు తగ్గింపు, ఇక గృహోపకరణాలు, కిచెన్ యాక్సెసరీస్, అవుట్ డోర్ యాక్సెసరీస్ పై 70 శాతం వరకు తగ్గింపు, లాప్టాప్ లపై 75% వరకు తగ్గింపు ఇస్తుంది.
స్మార్ట్ వాచ్లు, హెడ్ ఫోన్లు, టీవీలు, ఉపకరణాలు, పుస్తకాలు, బొమ్మలు, బట్టలు ఇంకా మరిన్నింటిపై 80 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. ఇక amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్, కిక్‌స్టార్టర్ డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, 8PM డీల్స్, ఇలా రకరకాల డీల్స్ ఉంటాయి.
999, ప్రైస్ క్రాష్ స్టోర్, క్రేజీ కాంబోలు, ఉత్పత్తులపై కూపన్ తగ్గింపు, క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లు మరియు రీఛార్జ్ ద్వారా నగదు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు మరియు EMIతో 10% తక్షణ తగ్గింపును అందించడానికి SBIతో భాగస్వామ్యం కలిగి ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 గురించి మరిన్ని వివరాల కోసం మీరు Amazon.inని విజిట్ చెయ్యండి. మరెందుకాలస్యం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి రెడీ అయిపోండి.












Click it and Unblock the Notifications