అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్: అదిరిపోయే ఆఫర్లతో పండుగ చేసుకోండిక!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కు సిద్హమైంది. పండుగ ఏదైనా సరే కొనుగోలుదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటూ బిజినెస్లో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా రానున్న రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్టు సమాచారం .
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున, అమెజాన్ తన రిపబ్లిక్ డే సేల్‌ను కూడా ప్రారంభించనుంది. ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్ 13 మరియు వన్‌ప్లస్ 11 సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో లభిస్తాయి. ఈ-కామర్స్ కంపెనీ రాబోయే సేల్‌లో వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్‌లను అందిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐలపై 10శాతం డిస్కౌంట్ ఇస్తుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు మరియు స్మార్ట్ టీవీలు వంటి ఉత్పత్తులపై డీల్‌లు, డిస్కౌంట్లు మరియు ఆఫర్‌లు లభిస్తాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించిన ఈ కామర్స్ టైటాన ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందు రాత్రి నుండి ఈ సేల్ అందుబాటులోకి తీసుకువస్తుంది.
అమెజాన్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వేర్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ఉత్పత్తులతో వివిధ వర్గాల వారికి డిస్కౌంట్ ను అందిస్తూ సేల్స్ నిర్వహించనుంది. ఈ సేల్ లో iPhone 13 నుండి OnePlus 11 వరకు, చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం రూ.59,900కు విక్రయిస్తున్న ఐఫోన్ 13 ప్రత్యేక తగ్గింపుతో ఈ సేల్ లో లభిస్తుంది . మరోవైపు, OnePlus 11 ధర ప్రస్తుతం రూ. 56,999 ప్రత్యేక తగ్గింపుతో కూడా అందుబాటులో ఉంటుంది. గత సంవత్సరం, సేల్ జనవరి 15న ప్రారంభమైంది, కాబట్టి ఈ ఏడాది కూడా అదే సమయంలో సేల్ ప్రారంభం కావచ్చని అంటున్నారు. అయితే కొన్ని టెక్ వెబ్ సైట్లు ఈనెల 14 నుండి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications