Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై నమోదైన 36 కేసుల్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ రిపోర్ట్ నేపథ్యంలో గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన జంతుకొవ్వు, పంది కొవ్వు ఆరోపణలు తేలిపోయాయంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. దీంతో టీడీపీ నెయ్యి కల్తీ ఆరోపణలు నిజమయ్యాయంటూ మహాపాపం పేరుతో ప్లెక్సీలు వేయించింది. ఈ ఫ్లెక్సీల్ని తొలగించేందుకు వెళ్తున్న అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని బూతులు తిట్టడం, ఆయన వాళ్లను తిరిగి తిట్టే క్రమంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిపోయాయి.

Ambati Rambabu Protected from Arrest in 35 Cases by High Court Ruling in Chandrababu remarks case

దీంతో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటిపైకి వెళ్లి టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత అంబటి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులోని నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపారు. దీంతో పాటు మిగిలిన 35 కేసుల్నీ క్వాష్ చేయాలంటూ అంబటి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు.. అంబటి పిటిషన్ పై విచారణ జరిపింది.

Ambati Rambabu Protected from Arrest in 35 Cases by High Court Ruling in Chandrababu remarks case

ఈ 35 కేసుల్లో అంబటిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై మాత్రం మార్చి 2కు విచారణ వాయిదా వేసింది. మరోవైపు ప్రస్తుతం అంబటి జైల్లో ఉన్న కేసుకు సంబంధించి ఆయన బెయిల్ పొందే అవకాశం ఉండటంతో ఇతర చోట్ల నమోదైన కేసుల్లో ఆయన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ కేసుల్నీ ఒకే వ్యాఖ్యలపై ఉండటంతో హైకోర్టు వీటిపై 41ఏ నోటీసు ఇచ్చి విచారణ జరపాలని, ఆయన్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+