అమానుషం.. : ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
పార్వతిపురం : చిన్నా.. పెద్దా.. అన్న తేడా లేకుండా చిన్నారులు, మహిళలపై మృగాళ్ల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదేళ్ల చిన్నారిపై ఓ అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేకానంద నగర్ కాలనీలో చోటు చేసుకుంది.
మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి బాబురావు(60) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాబురావు లైంగిక దాడితో తీవ్ర రక్త స్రావమైన చిన్నారి, రక్తపు మరకలతో ఇంటికి చేరుకుంది.
జరిగిన విషయం కాస్త చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో, వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు బాబురావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బాబురావు ఇదివరకే అత్యాచార కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్టుగా తేలడం గమనార్హం.

అనుమానస్పద స్థితిలోఇంజనీరింగ్ విద్యార్థి మృతి..
నెల్లూరు : కావలిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మిస్టరీగా మారింది. కావలి విట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వి.చిరంజీవి బిట్రగుంట సమీపంలోని కడనూతల వద్ద శవమై కనిపించాడు.
నాయుడుపేట మండలం విన్నమాల గ్రామం చిరంజీవి స్వగ్రామంగా తెలుస్తోంది. కాగా, చిరంజీవిపై అతను చదువుతున్న కాలేజీ యాజమాన్యానికి తన క్లాస్ మేట్ అయిన ఓ యువతిని వేధించినట్టుగా ఫిర్యాదు రావడంతో చిరంజీవిని కాలేజీ హాస్టల్ నుంచి బయటకు పంపించివేసింది యాజమాన్యం. అప్పటినుంచి కావలిలోనే ఒక గది అద్దెకు తీసుకుని చదువును కొనసాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే మే 2నుంచి కనిపించకుండా పోయిన చిరంజీవి కడనూతల వద్ద మృతదేహామై కనిపించాడు. మృతదేహాం పక్కన నిద్రమాత్రలు కూడా లభించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications