టీవీ9 జాఫర్ కు ఆనం ఝలక్ : 'కాపురాల్లో చిచ్చు పెడుతున్నావని' కౌంటర్

Subscribe to Oneindia Telugu

నెల్లూరు : ఏం చేసైనా సరే జనం ఛానెల్ మార్చకుండా చేయాలనేది ప్రస్తుతం న్యూస్ ఛానెల్స్ ఫాలో అవుతోన్న ట్రెండ్. ముఖ్యంగా ప్రముఖుల ఇంటర్వ్యూలను సంచలనాలకు కేరాఫ్ గా మార్చుకుని కథనాలు ప్రసారం చేయడం.. తద్వారా టీఆర్పీ పెంచుకోవాలనేది ఛానెల్స్ ఎత్తుగడ. అయితే అందరూ ఆ ఎత్తుగడలకు చిత్తవరు కదా..!

ఇదే తరహాలో నెల్లూరు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి టీవీ9 యాంకర్ జాఫర్ కు జలక్ ఇచ్చారు. టీవీ9 నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. తాజాగా ఆనంను ఇంటర్వ్యూ చేశారు టీవీ9 జాఫర్. అయితే ఇంటర్వ్యూలో భాగంగా.. వ్యక్తిగత విషయాలను బయటకు లాగాలని జాఫర్ ఎంతగా ప్రయత్నించినా..! ఆనం ఆ విషయాలను ప్రస్తావించలేదు సరికదా.. జాఫర్ నే ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారంపై ఆనంను ప్రశ్నించారు జాఫర్. అయితే దీనిపై స్పందించిన ఆనం మాత్రం.. "దణ్ణం పెడతానయ్యా నీకు. ఎందుకయ్యా నన్ను సతాయిస్తున్నావ్. నాయబ్బా.. ఎందుకు నాతండ్రా... ఇట్లాంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించడం తప్ప ఏమైనా ఉందా? పెండ్లికి ముందు ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకయ్యా?" అంటూ సున్నితంగానే జాఫర్ కు చురకంటించేశారు ఆనం.

Anam Viveka Counter to TV9 Jaffer in an interview

అయితే అప్పటికీ వెనక్కి తగ్గని జాఫర్ మాత్రం ఆనంకు మరిన్ని ప్రశ్నలను సంధించారు. అయితే ఆనం కూడా కౌంటర్ తరహాలోనే సమాధానం చెప్పడంతో జాఫర్ ప్రశ్నలు జాఫర్ కే బెడిసికొట్టినట్టయ్యాయి. 'ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదన్న' జాఫర్ ప్రశ్నకు బదులిస్తూ.. "ఎందుకయ్యా దాని విషయాలు ఇప్పుడు. కాపురాల్లో చిచ్చు పెట్టే రకమయ్యా నువ్వు. నువ్వు మర్యాదస్తుడివి కాదయ్యా జాఫర్. నిజంగానే... కాపురంలో, మా కొంపల్లో చిచ్చు పెట్టడానికి నెల్లూరు వచ్చావు. అన్నీ నిజాలే చెబుతానంటే, ఇలాంటి ప్రశ్నలా అడిగేది?" అంటూ కౌంటర్ ఇచ్చారు ఆనం.

మాట్లాడితే అమ్మాయిలంటావు..!, అమ్మాయి ఎలా ఉందంటావు..! పొడుగా..? పొట్టా..? అని ఆరా తీస్తావు. ఎందుకయ్యా ఇలాంటి ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తావు అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు ఆనం వివేకానందరెడ్డి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anam made countering comments in an Interview that which he faced the questions from anchor jaffer, tv9. He said its not fair that asking questions about girls often

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి