Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శేఖర్ కమ్ముల పని: శాస్త్రికోసం అనామిక సెర్చ్(పిక్చర్స్)

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన గాలి పటాల ఉత్సవంలో ఓ వింతైన, ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మామూలు రోజుల్లో హైదరాబాద్ రోడ్ల మీద తిరగాలంటే విసుగు పుడుతుంది. చాలా కష్టంగా కూడా ఉంటుంది. సంక్రాంతి పండుగప్పుడు ట్రాఫిక్ ఆకాశంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు.

చిన్న, పెద్ద తేడా లేకుండా గాలిపటాలను ఎగురవేస్తూ ఆకాశంలో సందడి సృష్టిస్తుంటారు. ఎవరో ఎగురవేసిన పతగితో మన పతంగిపోటీ పడుతుంటే ఆ మజానే వేరు. ఈ ఏడాది పతంగుల పోటీ ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఏయితే, ఓ గాలి ఎగిరి అలసిపోయినట్లుగా కింద పడిన ఓ గాలిపటం మాత్రం అందరినీ నిలువరించి ప్రశ్నిస్తున్నట్లుంది.

ఆ గాలిపటాన్ని చూసి ఎవరీ అజయ్ శాస్త్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు వేలల్లో అజయ్ శాస్త్రి మిస్సింగ్ అని ఫొటోతో రాసి ఉన్న పతంగులను చూసి విస్మయం చెందడమే కాకుండా ఎవరీ అజయ్ శాస్త్రి అని ప్రశ్నించుకుంటున్నారు. అజయ్ శాస్త్రి మిస్సింగ్ అని ముద్రించిన గాలిపటాలు హైదరాబాదులో సందడి చేశాయి.

తీరా ఆరా తీస్తే తెలిసిందేమిటింటే - ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన అనామిక చిత్రం ప్రచారానికి ఈ కొత్త పద్ధతిని ఎంపిక చేసుకున్నారట. హిందీ కహానీ చిత్రం ఆధారంగా శేఖర్ కమ్ముల అనామిక పేరు మీద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రచారానికి శేఖర్ కమ్ముల కొత్త పద్ధతి ఎఁచుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 1

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 1

అజయ్ శాస్త్రి మిస్సింగ్ అని రాసి ఉన్న గాలిపటం కింద పడితే ఓ వ్యక్తి ఆసక్తికరంగా దాన్ని పరిశీలిస్తున్నాడు. ఇలా..

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 2

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 2

అసలు అజయ్ శాస్త్రి ఎవరు, వ్యక్తి కనిపించకుండా పోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ ఈ విధంగా చేయడం ఏమిటని హైదరాబాద్ గాలిపటాల ప్రేమికులు ప్రశ్నించుకుంటున్నారు.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 3

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 3

ఎవరైనా మిత్రుడిని ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారా, ఇందులో ఏదైనా సృజనాత్మకత ఉందా అనే కోణంలో కూడా ప్రజలు ప్రశ్నించుకున్నారు.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 4

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 4

తన భర్త అజయ్ శాస్త్రిని అన్వేషించడానికి ఆయన భార్య అనామిక శాస్త్రి ఈ పద్ధతిని ఎంచుకున్నారట. ఆమె ఈ కొత్త రకం మీడియా ద్వారా భర్తను అన్వేషించడానికి పూనుకున్నారు.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 5

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 5

అజయ్ శాస్త్రి మిస్సింగ్ అంటూ రాసి ఉన్న గాలిపటాలను హైదరాబాదీలు అతి జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్లారు.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 6

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 6

అజయ్ శాస్త్రి మిస్సింగ్ అంటూ అనామిక శాస్త్రి రూపొందించిన గాలిపటాలు ఒకటి, రెండు కాదు పెక్కు ఆకాశంలో ఎగిరి, కింద పడిపోయాయి.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 7

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 7

అజయ్ శాస్త్ర్రి మిస్సింగ్ అనే గాలిపటాలు హైదరాబాదులోని చిన్నారుల చేతుల్లోనూ దర్శమనిచ్చాయి. పలు చోట్ల అవి కనిపించాయి.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 8

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 8

అజయ్ శాస్త్రి మిస్సింగ్ అనే గాలిపటాలు ఇలా దుకాణంలోనూ దర్శనమిచ్చాయి. వాటిని ప్రత్యేకంగా తయారు చేసినట్లు కనిపిస్తోంది.

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 9

అజయ్ శాస్త్రి మిస్సింగ్ 9

భార్య అనామిక శాస్త్రి చేసిన ఈ కొత్త ప్రయత్నం ఫలిస్తుందా, ఇది అనామిక శాస్త్రికి ఉపయోగపడి, భర్త అజయ్ శాస్త్రి దొరుకుతాడా చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+