బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప; వీడియో వైరల్!!

శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ, జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రశాంతంగా జీవించటానికి భరోసా ఇస్తూ ఎప్పుడూ సీరియస్ గా ఉండే పోలీస్ బాస్ ఆడి పాడి సందడి చేస్తే, పోలీస్ సిబ్బందిలో ఉండే జోష్ అంతా ఇంతా కాదు. విధినిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు వీక్ ఆఫ్ ఇవ్వడంతో కాస్త రిలీఫ్ అయ్యారు. అనంతపురం జిల్లా పోలీసులు వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి ఫకీరప్ప కూడా వారితో కలిసి పోయారు.

పోలీసుల వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంత ఎస్పీ ఫకీరప్ప

అనంతపురం జిల్లా కంబదూరు మండలం రామప్ప బండ వద్ద పోలీసులు వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అండేపల్లి గ్రామ కొండలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్తీకమాసం వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప కల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ దుర్గం డివిజన్లోని పోలీసులు, వారి కుటుంబాలతో పాటు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి సందడి చేశారు. ఆయన ఆడి పాడి సంతోషంగా గడిపారు.

ఏపీ ప్రభుత్వం పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వటంతో వనభోజనాలు నిర్వహించిన పోలీసులు

రాష్ట్రప్రభుత్వం పోలీసులకు వీక్లీ ఆఫ్ కల్పించిన వెసులుబాటులో భాగంగా పోలీసులు నిర్వహించిన వన భోజనాల ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఎస్పీ పకీరప్ప తన చిన్న నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి అల్లరిని పోలీస్ కుటుంబాలతో పంచుకున్నారు. నిత్యం ప్రజల సేవలో, తీవ్రమైన ఒత్తిడి మధ్య పనిచేసే పోలీసులకు ఆత్మస్థైర్యం నింపడానికి ఆయన ప్రయత్నించారు. పోలీసులు కూడా అప్పుడప్పుడు కాస్త తమ కుటుంబాలతో గడపడానికి ఇలా సమయం కేటాయిస్తే ఒత్తిడి నుంచి పోలీసులు కాస్త బయటపడే అవకాశం ఉంటుందని పకీరప్ప పోలీస్ కుటుంబ సభ్యులతో వెల్లడించారు.

పోలీస్ కుటుంబాలతో రోజంతా గడిపిన ఎస్పీ ఫకీరప్ప.. బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు

పోలీస్ వ్యవస్థ లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆయన పోలీస్ కుటుంబాలతో కలిసి రోజంతా గడిపారు. వారితో కలిసి భోజనం చేశారు. ఇక పోలీసులు కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో కలిసి బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆయన వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీ డియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సీరియస్ గా ఉండే పోలీస్ బాస్, సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులేయడంతో అనంతపురం జిల్లా పోలీసులు తెగ సంబర పడుతున్నారు.

వన భోజనాల మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫకీరప్ప

వన భోజనాల మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫకీరప్ప

ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వన భోజనాల కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పలువురు పోలీసు అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. జోష్ తో సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీసుల కుటుంబ సభ్యులతో కలిసిపోయిన జిల్లా ఎస్పీ చూపించిన చొరవ, ఆయన ఉత్సాహం, జిల్లా ఎస్పీ ఆట పాటలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. పోలీసులకు ఆయన సూపర్ బాస్ మాత్రమే కాదు వారితో మమేకమైన, కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన మంచి మనసున్న బాస్ గా కూడా మారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+