అదేంటి..? అనసూయ అలా చేసింది?

యాంకర్ అనసూయ ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నెగిటివ్ కామెంట్స్ తో నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తుంటారు. అకస్మాత్తుగా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను షేర్ చేయడంపై అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోతోపాటు సుదీర్ఘమైన పోస్ట్ కూడా అనసూయ పెట్టారు.

హాయ్.. మీరంతా మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ఈ పోస్ట్ కు మీరంతా చాలా గందరగోళంలో ఉంటారని తెలుసు. నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను కమ్యూనికేషన్లు పెంచుకోవడానికి ఒక ప్లాట్ ఫారమ్ గా ఉపయోగించుకుంటారు. సమాచారం తెలుసుకోవడానికి వాడేవారు. కానీ మనం ఇప్పుడు దేనికోసం సోషల్ మీడియాను వాడుతున్నామని ప్రశ్నించారు.

anasuya bharadwaj crying video

మన బాగు కోసమే వాడుతున్నామా? ఒకరికి మరొకరు మద్దతుగా ఉండటానికి వాడాలి. తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలి.. ఇతరుల జీవనశైలి, సంస్కృతులను తెలుసుకుంటుండాలి. కానీ సోషల్ మీడియాను వాడుతున్న తీరుపై నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ పోస్ట్ పెట్టడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫోజులు.. ఫోటోషూట్‌లు.. చిరునవ్వులు.. చిందులు.. బలమైన కౌంటర్లు.. పునరాగమనాల్లాంటివి నా జీవితంలో ఒక భాగమే. మీరు అలాగే ఉన్నారు. నేను అదంతా మీతో పంచుకుంటాను.. నా జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న సందర్భాల గురించికానీ, ఇలా ఏడుస్తున్న విషయాలను ఎక్కువగా చెప్పుకోలేదు..

కానీ కొన్ని విషయాలను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.. నా అభిప్రాయాలను నేను ఎప్పుడూ నిక్కచ్చిగానే చెబతుంటాను. కొన్నిసార్లు నాపై ట్రోలింగ్ జరుగుతుంది.. రెండు మూడురోజులు బాధపడి తిరిగి నవ్వుతూ మీ ముందుకు వస్తున్నాను.. విశ్రాంతి తీసుకొని రీఛార్జ్ అవుతాను.. సమస్యల నుంచి పారిపోయే మనస్తత్వం కాదు నాది.. అందరి పట్ల దయగా ఉండాలని అందరినీ కోరుతున్నాను..

ఎదుటి వారు మనకు ఏం చేసినా సరే.. వారిపై దయను చూపించండి.. వారికి సమస్యలు వస్తే అండగా ఉండండి.. వాళ్లే తిరిగి మీ వద్దకు వస్తారు.. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.." అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐదు రోజుల క్రితం తనకు బాగా లేకపోతే.. ఇలా రికార్డ్ చేసి మెమరీగా పెట్టుకున్నానని వెల్లడించారు. అయితే పోస్ట్ లో తాను ఎందుకు ఏడుస్తున్నాననే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ గురించి కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+