మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని భర్తను చితకబాదిన టీవీ యాంకర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తకు ఓ యాంకర్ బుద్ది చెప్పింది. అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్థానికుల సహకారంతో చితక్కొట్టింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఈసీఎల్‌లో జరిగిది.

ఈ టీవీ ఛానల్ యాంకర్ గొడవ స్థానికంగా కలకలం రేపింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆమె మహిళా సంఖాలతో కలిసి భర్త పైన దాడి చేసింది. వివాహం అయి పది సంవత్సరాలు అయినా తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది.

గత కొన్నాళ్లుగా అతను ఇంటికి రావడంలేదని, వేరే మహిళతో సంబంధం పెట్టుకొని ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడని తెలిసి నిలదీసినట్లు తెలిపింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Anchor beats husband for extramarital affair

బాధితురాలైన యాంకర్ పేరు పద్మావతిగా తెలుస్తోంది. భర్త పేరు సతీష్. వీరికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో సతీష్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే తనను దూరంగా ఉంచాడని చెబుతోంది.

కట్నం కింద 30 తులాల బంగారం, నగదు ఇచ్చినప్పటికీ ఇంకా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆయన తన పద్ధతి మార్చుకోకపోవడంతో సతీష్ నివాసం వద్దకు వెళ్లి మహిళా సంఘాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసింది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anchor beats husband for extramarital affair
Please Wait while comments are loading...