చంద్రబాబుకు సవాలే: సీట్ల పెంపుకోసమే ఏపీ సీఎంపై బీజేపీ మైండ్ గేమ్..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ - బీజేపీ కూటమిలో సీఎం చంద్రబాబుపై మిత్రపక్ష నేతలు వరుసగా అనూహ్య రీతిలో మూడు రోజులుగా మండిపడటానికి తెర వెనుక నేపథ్యం ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు తొలి నుంచి చంద్రబాబు పనితీరుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపైనా, ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగంపైనా బీజేపీ నేతల విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత వీరి దూకుడు మరింతగా పెరిగింది.

 మైండ్ గేమ్‌లో ముందున్న ఏపీ బీజేపీ నేతలు

మైండ్ గేమ్‌లో ముందున్న ఏపీ బీజేపీ నేతలు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు ఒక అడుగు ముందుకేసి.. చేతనైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రకటించమని చెప్పాలని సవాల్ చేసే వరకూ వెళ్లారు. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నదని కూడా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు, అటాకింగ్ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని అతిగా అంచనా వేసుకుంటున్నదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. అయితే అదే సమయంలో సీట్ల సర్దుబాటు చేసుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబుతో మైండ్ గేమ్‌లో భాగంగానే కమలనాథులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

 ఎంపీ సీట్ల పెంపు కోసం బీజేపీ నేతల వ్యూహం ఇలా

ఎంపీ సీట్ల పెంపు కోసం బీజేపీ నేతల వ్యూహం ఇలా

అయితే ఏపీలోని కమలనాథులకు తమ బలం ఎంత అన్న సంగతి ఖచ్చితంగా తెలుసునన్న అభిప్రాయం కూడా ఉంది. అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసే సామర్థ్యం వారికి తెలుసునని విశ్లేషకులు అంటున్నారు. నాయకులు తప్ప, పలు నియోజకవర్గాల పరిధిలో సరిపడా కార్యకర్తలు కూడా లేరని అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారాన్ని పదిలం చేసుకోవడానికి అధిక లోక్ సభ స్థానాలు పొందే ఎత్తుగడలో భాగంగానే కమలనాథులు ఇలా ఎదురుదాడికి దిగుతున్నారని అవగతమవుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరమే కావడంతోపాటు రాష్ట్రంలో అభివ్రుద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడి ఉన్నారని కమలనాథులకు స్పష్టంగా తెలుసు. కానీ ఎన్నికల నిర్వహణ భిన్నమని అందరికీ తెలుసు. ఎన్నికల్లో పొత్తు, సీట్ల కేటాయింపు విషయాన్ని చివరి వరకు సాగదీసి చంద్రబాబు తనకు కావాల్సినట్లు తీర్చిదిద్దుకునే సామర్థ్యం కలిగి ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసునని విశ్లేషకులు అంటున్నారు.

వెంకయ్య శరణు కోరిన ఏపీ సీఎం చంద్రబాబు

వెంకయ్య శరణు కోరిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ అన్ని రకాల అడ్డంకులు కల్పిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పాత స్నేహితుడు, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శరణు కోరారని సమాచారం. వెంటనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంటనే కేంద్ర జల వనరుల శాఖ అధికారులను పిలిపించి రహస్యంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారని వినికిడి. అలాగే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ మాట్లాడారని వార్తలొచ్చాయి. ఎటువంటి సందేహాలు లేవనెత్తకుండా సజావుగా ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణానికి చేయూతనివ్వాలని గడ్కరీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారని సమాచారం.

హరిబాబుతో భేటీ తర్వాత పనుల పూర్తికి కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇలా

హరిబాబుతో భేటీ తర్వాత పనుల పూర్తికి కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇలా

దీంతోపాటు ఇటు వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు రాయబారిగా చంద్రబాబు పంపారని వార్తలొచ్చాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో అన్ని అంశాలను పరిష్కరించాలని హరిబాబు ద్వారా చంద్రబాబు కోరారని వినికిడి. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే టీడీపీతోపాటు బీజేపీకి కూడా సహాయకారిగా ఉంటుందని అన్నట్లు సమాచారం. ప్రస్తుత కాంట్రాక్టర్ల సాయంతోనే నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపుతోపాటు అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారని వార్తలొచ్చాయి. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా సిమెంట్ సరఫరా చేసేలా సదరు సిమెంట్ కంపెనీలకు ఆదేశాలిచ్చేందుకు మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The sudden outburst from the Bharatiya Janata Party leaders in Andhra Pradesh against their political ally Telugu Desam Party and its president N Chandrababu Naidu in the last three days has surprised many. Though the Andhra BJP leaders like Somu Veerraju, Daggubati Purandeshwari and B Vishnu Kumar Raju have been critical of Naidu now and then, they had confined mostly to issues like Polavaram project and misuse of central funds by the state government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి