Pawan Kalyan: అమ్మ మురిసేలా.. కార్యకర్త గర్వించేలా

రాజకీయాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ విలువలకు, మానవత్వానికి పెద్దపీట వేసే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM PAwan Kalyan) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల (జూ పార్క్)ను సందర్శించిన ఆయన, అరుదైన రీతిలో తన మాతృప్రేమను చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

సాధారణంగా ప్రముఖులు తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజున వేడుకలు చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వినూత్నంగా ఆలోచించి, ఆ రెండు జిరాఫీల సంపూర్ణ సంరక్షణ మరియు ఆహార ఖర్చులను ఏడాది పాటు తానే వ్యక్తిగతంగా భరిస్తానని వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా జంతు సంరక్షణ పట్ల తనకున్న అంకితభావాన్ని ఆయన నిరూపించుకున్నారు. "ప్రకృతిని, మూగజీవాలను ప్రేమించడం మన బాధ్యత" అని చాటిచెబుతూ, వన్యప్రాణుల దత్తత కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద వ్యక్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Andhra Pradesh Deputy CM Pawan Kalyan Visits Visakhapatnam Zoo Adopts Giraffes Promotes Wildlife Conservation

జంతువులతో పవన్ ముచ్చట్లు.. క్షేత్రస్థాయి పరిశీలన

జూ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేవలం అతిథిలా కాకుండా, ఒక జంతు ప్రేమికుడిగా కనిపించారు. జూలో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. ఏనుగులు, జిరాఫీల వద్దకు వెళ్లి వాటికి స్వయంగా ఆహారాన్ని తినిపించారు. ఈ క్రమంలో జూ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అధికారులకు ఆదర్శంగా నిలిచారు. సింహాలు, పులులు, నీటి ఏనుగుల సంరక్షణ గురించి, వాటికి పెట్టే ఆహారం మరియు వాటి పేర్లను క్యూరేటర్‌ను అడిగి ఆసక్తిగా తెలుసుకున్నారు.

ప్రకృతి ఒడిలో 'కనోపీ వాక్'

జూ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ కంబాలకొండ ఎకో పార్క్‌కు చేరుకుని అక్కడ 'నగర వనాన్ని' ప్రారంభించారు. అటవీ శాఖ అధికారులతో కలిసి చెక్క వంతెనపై 'కనోపీ వాక్' చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. మార్గమధ్యలో ఉన్న ఔషధ మొక్కలు, అటవీ జీవవైవిధ్యంపై అధికారులతో చర్చించారు. అటవీ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు.

అమ్మ జన్మదినాన్ని వన్యప్రాణుల సంరక్షణతో ముడిపెట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నిజమైన నాయకుడు ప్రకృతిని ప్రేమిస్తాడు" అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+