హజ్ యాత్రికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! అక్కడి నుంచి వెళ్తే లక్ష..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లే వారికి వర్తించేలా ఇవాళ ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆఫర్ ను సదరు హజ్ యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి పవిత్ర మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ ప్రకటన చేసారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్ కు వెళ్లే వారందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Andhra Pradesh Government Announces 1 Lakh Aid for Haj Pilgrims from Vijayawada

ఆదాయం తో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ ఈ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు ఇలా లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు.

Andhra Pradesh Government Announces 1 Lakh Aid for Haj Pilgrims from Vijayawada

గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి హజ్ కి వెళ్లే వారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+