Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం

అమరావతి: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ బుధవారం ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం అవసరమని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో ఇంకా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి డిమాండ్లతో కూడిన బడ్జెట్ ఆర్డినెన్స్ ‌ను జారీ చేశారు. మొత్తం రూ. 1.29 లక్షల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్స్ ను జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

Andhra Pradesh Otan Account Budget approved by Governor Abdul Nazeer

కాగా, ఈ ఆర్డినెన్స్ ద్వారా అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది ప్రభుత్వం. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరికొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కేటాయించినట్లు తెలిసింది.

కాగా, ఏపీ చరిత్రలోనే ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, 2024 సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

ఏపీ కేబినెట్ సమావేశం ఆగష్టు 7 తేదీకి వాయిదా పడింది. ఆగస్టు 2 తేదీన జరగాల్సిన మంత్రి వర్గం సమావేశం వాయిదా వేస్తున్నట్లు సీఎస్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఆగస్టు 7 తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆగస్టు 5వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనున్న దృష్ట్యా 2 తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+