• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు??

|
Google Oneindia TeluguNews

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వారిలో ఎవరికి అధికారం అప్పజెప్పాలన్నది రాజుకు సందిగ్ధంగా మారింది. ఒక్కొక్క కుమారుడు ఒక్కో విషయంలో నిపుణులు. రాజ్యానికి రాజుగా 5 సంవత్సరాలకు ఒకరిని ఎన్నుకుంటారు. ఏడుగురు కొడుకులకు 35 సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకు తాను బతికుండను కాబట్టి ఎవరెవరికి ఏ సమయంలో, ఎవరి తర్వాత ఎవరికి మహారాజు పదవిని అప్పజెపితే బాగుంటుంది అనే విషయమై మంత్రితో చర్చించాడు. అన్నింటిలో సలహాలిచ్చే మంత్రికి కూడా ఈ విషయం క్లిష్టతరంగా మారింది.

ఒక్కొక్కరికి 5 సంవత్సరాల చొప్పుున..

ఒక్కొక్కరికి 5 సంవత్సరాల చొప్పుున..

ఒక్క కొడుకే అయితే యువరాజుగా పట్టాభిషేకం చేసేవాడు. ఏడుగురు కొడుకులకు న్యాయం చేయాలి కాబట్టి 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు పెడుతున్నాడు. ఈ ఏడుగురిలో ఎక్కువ శాతం ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారికే రాజ్యాధికారం అప్పగిస్తున్నాడు. ప్రస్తుతం ఒక కుమారుడు రాజుగా అధికారంలో ఉన్నాడు. ఆ రాజును మళ్లీ ఎంపిక చేయాలంటూ రాజ్యంలో కొంత శాతం ప్రజలు కోరుతున్నారు. ఇంకొందరు ఇంకో కొడుకును కోరుతున్నారు. మరికొందరు మూడో కొడుకును కోరుకుంటున్నారు. మొత్తంగా ఆ ఏడుగురు కొడుకులెవరంటే వరుసగా వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, సోము వీర్రాజు, సీపీఐ రామకృష్ణ, సీపీఎం వి.శ్రీనివాసరావు, లోక్ సత్తా జేపీ ఉన్నారు.

మొదటి, రెండో కుమారుడి మధ్యే తీవ్ర పోటీ!

మొదటి, రెండో కుమారుడి మధ్యే తీవ్ర పోటీ!


ఎన్నికలు నిర్వహించే సమయంలో కొడుకులు విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడతాయి. ఇప్పుడున్న పెద్ద కుమారుడు (జగన్) సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు. కరోనా లాంటి సమయంలో పథకాల పేరుతో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు వేయడంవల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారు. మరికొన్ని పథకాలను ప్రకటించి వివిధరకాల జనులకు నగదును అందిస్తూనే ఉన్నాడు. అయితే రెండో కుమారుడు (చంద్రబాబు) అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాడు. మొన్నటి వరకు రాజ్యానికి ఉన్న రాజధాని నగరాన్ని పక్క రాజ్యానికి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కొడుకు మూడు రాజధానులంటున్నాడు. ఈ విషయమే రాజ్యంలో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలు నిర్వహించే సమయం దగ్గరపడుతోంది!

ఎన్నికలు నిర్వహించే సమయం దగ్గరపడుతోంది!


మళ్లీ ఇంకో కొడుకును రాజుగా చేయడానికి ఎన్నికలు నిర్వహించే సమయం దగ్గరపడుతోంది. అయితే దేశానికి రాజుగా ఉన్న వ్యక్తిని(మోడీ) తనతో చేతులు కలపమని ఒక కొడుకు(చంద్రబాబు) అడుగుతున్నప్పటికీ వారు అంగీకరించడంలేదు. ఇతనితో కలిసే మూడో కుమారుడిని(పవన్ కల్యాణ్) కూడా కలవనివ్వడంలేదు. దీంతో రాజ్యంలోని రాజకీయం రసవత్తరంగా మారింది. తన మాట ప్రకారం ఒకరి తర్వాత ఒకరికి అధికారం అప్పజెబుదామంటే కొడుకుల మధ్య ఐక్యత లోపించి వారిలోవారే యుద్ధాలు చేసుకుంటున్నారు. దీనివల్ల పక్కరాజ్యాలకు అలుసుగా మారిపోయామని, వెంటనే ఈ పరిస్థితిని మార్చాలని రాజు, మంత్రి నిర్ణయించారు. వీరిద్దరూ ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

English summary
That king had seven sons.The king was in a dilemma as to which of them he should hand over the power to
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X