‘ఒంగోలు గిత్త’లో ప్రకాశ్‌రాజా?: ఆనంకు జగన్ పార్టీ ఎమ్మెల్యే హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డిపై జగన్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ వికృత చేష్టలు, నటనలను అదుపులో పెట్టుకో' అంటూ ఘాటుగా స్పందించారు.

నోరు, భాషను అదుపులో పెట్టుకోవాలంటూ వివేకానందను అనిల్ హెచ్చరించారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారే సంస్కృతి ఆనం సోదరులదేనని విమర్శించారు.జగన్ ను చూస్తుంటే 'ఒంగోలు గిత్త' అనే సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గుర్తొస్తోందని వివేకా ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

Anil Kumar Yadav fires at anam vivekananda reddy

పగలంతా మార్కెట్ యార్డులో పెద్ద మనిషిగా చలామణి అయి, రాత్రి కాగానే మందు కొట్టి, బట్టలు విప్పేసి పడుకునే సీన్ గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఉద్దేశించి ఆనం వివేకానంద రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Anil Kumar Yadav fired at TDP leader Anam Vivekananda Reddy for allegations on his party president YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి