Anna Canteens: ఈసారి అన్నా క్యాంటీన్లలో రేట్లు ఇవే..!

ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్నక్యాంటీన్ల పునరుద్దరణపైనే చేశారు. దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సుగమమైంది.త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ కాబోతున్నాయి.

అయితే గతంలో ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్ కూడా అందించిన అన్న క్యాంటీన్లలో ఐదేళ్ల విరామం తర్వాత కూడా అవే ధరలు ఉండబోతున్నాయా లేక పెరుగుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. బియ్యం, పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్లలో ధరలపై జరుగుతున్న చర్చకు తెరదించుతూ స్వయంగా సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు.

anna canteens to be resumed soon after 5 years in ap here are prices for tiffin and meals

సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+