ఏపీలో ఎంటరైన మరో కొత్త అఘోరీ.. ఆ పనితో స్థానికులు షాక్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా చేస్తున్న విషయం తెలిసిందే. లేడీ అఘోరి నాగసాధు గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ఆలయాలను సందర్శించడంతోపాటు ఆలయాల పైన దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ప్రభుత్వాలపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ హంగామా
రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ఆలయాలను సందర్శించి స్మశానాలలో రాత్రివేళ బసచేస్తూ త్రిశూలాలు, పుర్రెలతో పూజలు చేస్తూ హంగామా చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ లేడీ అఘోరి నాగసాధు బట్టలు లేకుండా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆలయాల వద్ద చేస్తున్న హడావిడి కి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజలు షాక్ కు గురవుతున్నారు.

మళ్ళీ కొత్త అఘోరీ ఎంట్రీ
అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆత్మ త్యాగం ప్రయత్నం కూడా చేయడంతో అఘోరీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. ఇక ఇదే సమయంలో మళ్లీ మరొక అఘోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షం కావడం అందరి దృష్టిని అఘోరీపై మళ్లించేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హడావిడి చేస్తున్న అఘోరీ అనుకున్న వాళ్ళు, గడ్డం మీసంతో గొంతు కూడా వేరేగా ఉండటంతో మరో కొత్త అఘోరీగా భావిస్తున్నారు.
కర్నూలు లో కొత్త అఘోరీ
కర్నూలు జిల్లాలో ఈ కొత్త అఘోరి హల్చల్ చేశారు. అయితే గడ్డం మీసంతో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దిగంబరంగా ఒక కారులో ఒళ్లంతా బూడిద పూసుకుని, గడ్డం, మీసం, ముక్కుపుడక, చేతులకు గాజులు ధరించి అఘోరీ కనిపించారు. అక్కడ నిమ్మకాయలతో అర్ధరాత్రి వేళ ఏదో చేయడంతో స్థానికులు భయాందోళనకు లోనై ఆ అఘోరిని నిలదీశారు.
మీసాలు, గడ్డంతో కనిపించిన అఘోరీ
— ChotaNews (@ChotaNewsTelugu) November 24, 2024
కర్నూలు జిల్లాలో మరోసారి అఘోరీ హల్చల్ చేశారు. గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు.… pic.twitter.com/0zRhm4KZfE
నిమ్మకాయలతో అలా ... ప్రజల ఆందోళన
కొందరు మహిళలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నువ్వు చేసే పని వల్ల మాకు ఏమీ ఇబ్బంది కలగదు కదా అని అఘోరీని ప్రశ్నించగా తాను దిష్టి తీస్తున్నట్లు చెప్పారు. అయితే కారులో కూర్చున్న అఘోరిని జనాలు క్రిందికి దిగమని గొడవ చేశారు. అయినా కారు దిగని సదరు అఘోరి దిష్టి తీస్తున్నట్టు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం అఘోరి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications