మహేష్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్: డబుల్ బొనాంజా
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

ఇవ్వాళ ఆయన బర్త్‌డే. 47వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం ఆయన ఛరిష్మా చెక్కుచెదరలేదు. పైగా మరింత అందంగా తయారవుతున్నాడు. కోట్లాది మంది అభిమానులకు గుంటూరు కారం యూనిట్ నిద్ర లేకుండా చేసింది. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం పోస్టర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ కోసం అభిమానులు నిద్రమానుకుని మరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వెయిట్ చేశారు. మహేష్ బాబు పుట్టినరోజును సందర్భంగా యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్.. సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేసింది.
Wishing a very Happy Birthday to our highly Inflammable Super 🌟 @urstrulyMahesh garu. ⚡#HBDSuperstarMaheshBabu ✨#GunturKaaram #Trivikram @sreeleela14 @MusicThaman @meenakshiioffl @vamsi84 @NavinNooli #ASPrakash #GunturKaaramOnJan12th 🌶 pic.twitter.com/Ws7Xwd8QfD
— Haarika & Hassine Creations (@haarikahassine) August 9, 2023
ఈ కొత్త పోస్టర్‌లో మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. రేబాన్ కూలింగ్ గ్లాసెస్ ధరించి.. సిగరెట్ వెలిగిస్తూ ఇచ్చిన స్టిల్ అది. గళ్ల చొక్కా, లుంగీతో అదరగొట్టాడు. హ్యాపీ బర్త్‌డే టు సూపర్ స్టార్.. అనే క్యాప్షన్ ఈ పోస్టర్‌పై కనిపించింది. దీన్ని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ .. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై సరిగ్గా 12:06 నిమిషాలకు పోస్ట్ చేసింది.
ఈ సాయంత్రం మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది హారికా అండ్ హాసినీ క్రియేషన్స్. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్‌లో కనిపించాడిందులో మహేష్ బాబు. ముఠామేస్త్రీ లుక్‌ను గుర్తుకు తెచ్చాడు. గాలికివదిలేసిన రెడ్ కలర్ రగ్గ్డ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లాక్ కలర్ హాఫ్ బనియన్‌తో రచ్చ రచ్చగా దర్శనం ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో రౌడీలు నిల్చొని ఉండటం.. అది ఫైటింగ్ సీన్ కావొచ్చని చెప్పకనే చెప్పింది.












Click it and Unblock the Notifications